Home /News /movies /

F3 MOVIE VENKATESH VARUN TEJ ANIL RAVIPUDIS F3 MOVIE 1ST WEEK WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

F3 Movie 1st Week Collections : F3 మూవీ ఫస్ట్ వీక్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. టోటల్ వసూళ్లు ఎంతంటే..

వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (Photo Twitter)

వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (Photo Twitter)

F3 Movie 1st Week Box Office Collections | దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎఫ్ 3. వెంకటేష్, వరుణ్ తేజ్  హీరోలుగా నటించిన ఎఫ్ 3. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 7 రోజుతో పాటు మొత్తం మొదటి వారంలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

ఇంకా చదవండి ...
    F3 Movie 1st Week Collections | F3 Movie  అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా నిన్నటితో మొదటి వారం విజయ వంతంగా పూర్తి చేసుకుంది. మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 780 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా రెండవ వారంలో తెలంగాణ (నైజాం)లో 175 థియేటర్స్.. రాయలసీమ (సీడెడ్)లో 80 ప్లస్ థియేటర్స్‌, ఆంధ్ర ప్రదేశ్‌లో  ఈ సినిమా 215 థియేటర్స్‌లో కలిపి మొత్తంగా 470 స్క్రీన్స్‌లో ప్రదర్శించబడుతోంది. ఎఫ్ 2 తరహాలోనే F3 మూవీ ఆద్యంతం కామెడీతో ఈ  సినిమా ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది. దీంతో ఫ్యామిలీస్ ఈ సినిమాను చూసేందకు ఎగబడుతున్నారు. అనిల్ రావిపూడి కేవలం ఈ సినిమా టైటిల్‌ను మాత్రమే వాడుకొని  అవే పాత్రలతో ఎఫ్ 3 మూవీని తెరకెక్కించారు. 

    వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాతో పలకరించారు అనిల్ రావిపూడి. .ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటించారు. సోనాల్ చౌహాన్ అదనపు ఆకర్షణ. ఎఫ్ 3లో  ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. ఇక యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. F3 మూవీలో ప్రేక్షకులకు  ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా  7వ రోజు బాక్సాఫీస్ దగ్గర రూ. 1.77 కోట్ల షేర్ (రూ. 3.15  కోట్లు గ్రాస్) బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా వారం రోజుల్లో బాక్సాఫీస్  దగ్గర ఎంత రాబట్టిందే..

    నైజాం (తెలంగాణ):  రూ. 16.40 కోట్లు / రూ. 18 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 5.38 కోట్లు / రూ. 8.40 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 5.18 కోట్లు / రూ. 7 కోట్లు
    ఈస్ట్: రూ. 2.86 కోట్లు / రూ. 4.50 కోట్లు
    వెస్ట్: రూ.2.10 కోట్లు / రూ. 4 కోట్లు
    గుంటూరు: 2.82 కోట్లు / రూ. 5 కోట్లు
    కృష్ణా : 2.48 కోట్లు / రూ.4.50 కోట్లు
    నెల్లూరు:1.55 కోట్లు / రూ. 2.4 కోట్లు                                                                                              తెలంగాణ (TG) + ఆంధ్ర ప్రదేశ్ (AP) Total -రూ. 38.77 కోట్లు (62.15 కోట్ల గ్రాస్) / రూ. 53.80 కోట్లు

    కర్ణాటక + రెస్టాఫ్ భారత్    :రూ. 2.65 కోట్లు / రూ. 3.40 కోట్లు
    ఓవర్సీస్ :రూ. 6.75 కోట్లు /  రూ. 5.20 కోట్లు                                                                                      ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 48.17 కోట్లు ( రూ. 80.40 కోట్ల గ్రాస్ ) /రూ. 63.60 కోట్లు..

    Day 1 WW Share : రూ. 13.65 కోట్లు
    Day 2 WW Share : రూ. 9.85 కోట్లు
    Day 3 WW Share : రూ. 11.05 కోట్లు
    Day 4 WW Share : రూ. 5.40 కోట్లు
    Day 5 WW Share : రూ. 3.86 కోట్లు
    Day 6 WW Share : రూ. 2.59 కోట్లు
    Day 7 WW Share : రూ. 1.77 కోట్లు

    ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటించారు.మురళీ శర్మ,  శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో మెరిసారు. మొత్తంగా రూ.16.33 కోట్లు రాబడితే హిట్ అనిపించుకుంటోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో  ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనే దానిపై ఎఫ్ 3 బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anil Ravipudi, F3 Movie, Tollywood, Varun Tej, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు