F3 Movie : అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ షూటింగ్ తిరిగి ప్రారంభం.. మళ్లీ వెంకీ, వరుణ్‌ల హంగామా..

‘ఎఫ్3’ మూవీ షూటింగ్ రెజ్యుమ్స్ (Twitter/Photo)

Venkatesh-Varun Tej F3 Movie Shoot Resumes:  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.

 • Share this:
  Venkatesh-Varun Tej F3 Movie Shoot Resumes:  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. 2019 సంక్రాంతికి విడుదలైన సంచలన విజయం సాధించింది.  అనిల్ రావిపూడి డైరెక్టర్ చేసిన ఈ చిత్రం 2019 సూపర్ హిట్‌గా నిలిచింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక వరుణ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలనే తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్.

  నిన్న మొన్నటి వరకు  హైదరాబాద్‌లోనే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు అనిల్ రావిపూడి.  తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు సినిమా షూటింగ్ తిరిగి మొదలు పెట్టినట్టు ఓ వీడియోను విడుదల చేశారు.


  ఇదిలా ఉంటే తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట.  అంత బాగా స్క్రిప్ట్ వచ్చిందని.. లాక్ డౌన్ కావడంతో ఇంటి దగ్గరే కూర్చుని మరింత పక్కా స్క్రీన్ ప్లే రాసుకున్నారు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా ఎఫ్ 3 కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతుంది.

  NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

  ఎఫ్ 2 ఫ్రస్టేషన్స్ మీదే వెళ్లాడు అనిల్. కానీ మూడో భాగం మాత్రం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నట్టు సమాచారం. ఇది ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేసారు ఈ దర్శకుడు. అయితే కథ కూడా డబ్బుల చుట్టూనే తిరగనుంది. ఎఫ్ 2లో భర్తల ఫ్రస్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ భార్యలు చేసే పనులతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే కాన్సెప్టుతో ఎఫ్ 3 రానుందని ప్రచారం జరుగుతుంది.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లే ఈ సినిమా కథ. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నాడు  దర్శకుడు అనిల్ రావిపూడి. ఇదే మెయిన్ పాయింట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

  ఈ యేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’ ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు వెంకటేష్ హీరోగా నటించిన మరో మూవీ ‘దృశ్యం 2’ మూవీ దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంకోవైపు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమా కూడా దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: