F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ పాటను ఈ నెల 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘ఊ.. ఆ.. అహ.. అహ’ అంటూ సాగే పాటను దేవీశ్రీ ప్రసాద్ మంచి ట్యూన్స్ అందించినట్టు సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నట్టు అనిల్ రావిపూడి రీసెంట్‌గా జరిగిన పలు ఇంటర్వ్యల్లో ప్రస్తావించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది.
ఈ చిత్రాన్ని మే 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్.తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు.
Nagarjuna: ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున డూప్‌గా నటించింది ఈ స్టార్ హీరోనే.. ఇంత ఎవరో తెలుసా..
అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. గతేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’, దృశ్యం 2 ఈ సినిమాలు ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘గని’మూవీతో పలకరించారు. మరి ఎఫ్ 3 మూవీతో వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సత్తా చూపిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Ravipudi, F3 Movie, Mehreen Kaur, Tamannaah, Varun Tej, Venkatesh