Home /News /movies /

F3 MOVIE TWITTER REVIEW AND RATING MOVIE ON POSITIVE TALK SB

F3 Movie Twitter Review: ఎఫ్3 టాక్.. మహేష్ అన్న కోసం వెయిటింగ్..నెటిజన్ పోస్టులు

ఎఫ్ 3 సినిమా ట్విట్టర్ రివ్యూ

ఎఫ్ 3 సినిమా ట్విట్టర్ రివ్యూ

ఎఫ్3 సినిమా విషయానికి వస్తే.. సీరియస్ నోట్‌తో మురళీ శర్మ పరిచయంతో సినిమా ప్రారంభమయ్యింది. వెంకీ లోయర్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా సింపుల్‌గా పరిచయం అవుతాడు.

  అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌,వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన ఎఫ్‌3(F3 movie) మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల అయ్యింది. 2019లో సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3ని తెరకెక్కించారు. ఈ సినిమాలో త‌మ‌న్నా(Thamanna), మెహ‌రీన్(Mehreen), సునీల్ ,రాజేంద్ర ప్ర‌సాద్ కీలక పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఎఫ్3 సినిమా రన్ టైం.. 148 నిమిషాలు. కాసేపటి క్రితమే ఈ సినిమా ఫస్ట్ షో పూర్తయ్యింది. దీంతో దాదాపుగా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు.

  కొందరు ఈ సినిమా బావుందని... కామెడీ బాగా పండించారని.. కామెంట్లు చేస్తూ.. మరికొందరు మాత్రం సినిమా యావరేజ్ అంటున్నారు. ఈ చిత్రంలో కామెడీ బాగా వర్కౌట్‌ అయిందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. వెంకటేశ్‌ టైమింగ్ చాలా బావుందని నెటిజన్లు అంటున్నారు. స్టోరీ పెద్దగా ఏమీ లేకున్నా..కామెడీతో లాక్కొచ్చారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. సినిమా యావరేజ్‌గా ఉందని మరికొందరు నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఎఫ్3 మూవీ కంప్లీట్‌ ఫన్‌.. టైటిల్ కార్డ్స్ పడినప్పటి నుంచి క్రేజీ క్లైమాక్స్ వరకు ప్రతీ బిట్ బావుందని ఓ నెటిజన్ పోస్టు పెట్టారు. ఫ్యామిలీతో కలిసి ఎఫ్3 మూవీ చూడొచ్చని.. నవ్వులు పూయించే కామెడీ చాలానే ఉందని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు. ఫస్ట్ సెకండాఫ్ కూడా చాలా బాగుంది. వెంకీ,వరుణ్ తేజ్ కామెడీ టైమ్ అదిరింది.. ఫ్రాంచైజీ అంటే ఫన్ అది కరెక్ట్‌గా డెలివరీ చేశారు. అంటూ మరో నెటిజన్ పోస్టు పెట్టారు.

  ఇక ఎఫ్ 3 సినిమాపై అటు అనిల్ రావిపూడి కూడా కాసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో సినిమాపై ఇచ్చిన రివ్యూను ట్యాగ్ చేస్తూ.. ఆయన సెలబ్రేషన్స్‌కు చెందిన ఎమోజీలను పోస్టు చేశారు. అటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఎఫ్3 సినిమాపై ట్వీట్లు పెడుతున్నారు. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందు.... ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఎఫ్3లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని సీరియస్‌ను రివీల్ చేశారు. ఇక ఆయనతో పాటు పలువురు టాప్ హీరోలు కనిపిస్తారన్నారు. దీంతో ఇప్పుడు ఎఫ్3 మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.  ఎఫ్3 సినిమా విషయానికి వస్తే.. సీరియస్ నోట్‌తో మురళీ శర్మ పరిచయంతో సినిమా ప్రారంభమయ్యింది. వెంకీ లోయర్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా సింపుల్‌గా పరిచయం అవుతాడు. వెంకీ, వరుణ్ తేజ్ బాగా నటించారు. రాజేంద్రప్రసాద్ మరియు మిగిలిన గ్యాంగ్ మధ్య మరిన్ని హాస్య సన్నివేశాలు ఉన్నాయి. మెహ్రీన్ ఫన్నీగా పరిచయం చేయబడింది మరియు ఆమెకు కొత్త ట్యాగ్‌లైన్ వచ్చింది. వరుణ్ తేజ్, సునీల్ పరిచయం అయిన తర్వాత లబ్ డబ్ పాట వస్తోంది. తమన్నా ఆమె కుటుంబం మానిప్యులేటెడ్ ఫ్యామిలీగా పరిచయం అయ్యింది. పాత హిట్ ట్రాక్‌ రీమిక్స్‌కి వెంకటేష్ చక్కగా సరిపోయాడు. వెన్నెల కిషోర్ నవ్వించాడు.ట్విస్ట్‌తో వచ్చే పూజా హెగ్ధే స్పెషల్ సాంగ్ వస్తుంది. సినిమా మంచి నోట్‌తో మరియు ప్రత్యేక అతిధి పాత్రతో ముగుస్తుంది.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Anil Ravipudi, Daggubati venkatesh, F3 Movie, F3 Movie Review, Varun Tej

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు