F3 Shooting: ‘F3’లో ఎక్స్ ట్రా ఫన్.. కీలక పాత్రలో సునీల్.. సాక్ష్యం ఇదిగో..

ఎఫ్ 3 షూటింగ్ (F3 Shooting)

F3 Shooting: అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందరికీ తెలిసిపోతుందంతే. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు అనిల్.

  • Share this:
అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందరికీ తెలిసిపోతుందంతే. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు అనిల్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్‌లోనే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు అనిల్. వెంకటేష్, వరుణ్ తేజ్ సహా కీలకమైన నటీనటులు అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఆగస్ట్ 27న సినిమా విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ మేరకు ఇప్పటికే అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే సినిమాను పూర్తి చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇదిలా ఉంటే తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలవ్వడం ఖాయం అంటున్నాడు అనిల్. అంత బాగా స్క్రిప్ట్ వచ్చిందని.. లాక్ డౌన్ కావడంతో ఇంటి దగ్గరే కూర్చుని మరింత పక్కా స్క్రీన్ ప్లే రాసుకున్నామంటున్నాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా ఎఫ్ 3 కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతుంది. ఎఫ్ 2 ఫ్రస్టేషన్స్ మీదే వెళ్లాడు అనిల్. కానీ మూడో భాగం మాత్రం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నాడు. ఇది ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేసాడు ఈ దర్శకుడు.

f3 movie,f3 movie story,f3 movie story leaks,venkatesh varun tej f3 movie,f3 movie social media,telugu cinema,anil ravipudi f3 storyline,ఎఫ్ 3,ఎఫ్ 3 స్టోరీ లీక్,అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్టోరీ
ఎఫ్ 3 సినిమా (F3 movie)


భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లే ఈ సినిమా కథ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇదే మెయిన్ పాయింట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తైపోయింది.

ఎఫ్ 3 సినిమా (F3 movie)
ఎఫ్ 3 సినిమా (F3 movie)


ఇందులో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయిలో కామెడీ రోల్ చేస్తున్నాడు సునీల్. ముఖ్యంగా వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తాయని తెలుస్తుంది. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి కావడంతో దర్శక నిర్మాతలు షూటింగ్ పిక్ విడుదల చేసారు. ఆగస్ట్ 27న విడుదల కానుంది ఈ చిత్రం.
Published by:Praveen Kumar Vadla
First published: