Home /News /movies /

F3 MOVIE REVIEW AND RATING VENKATESH VARUN TEJ F3 MOVIE REVIEW ANIL RAVIPUDI AGAIN MAGIC WITH COMEDY TA

F3
F3
3/5
రిలీజ్ తేదీ:27/05/2022
దర్శకుడు : అనిల్ రావిపూడి
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీనటులు : వెంకటేష్,వరుణ్ తేజ్,రాజేంద్ర ప్రసాద్,తమన్నా,మెహ్రీన్, సోనాల్ చౌహాన్,మురళీ శర్మ,సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమా శైలి : కామెడీ ఎంటర్టేనర్
సినిమా నిడివి : 2Hr 30M

F3 Movie Review : వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘F3’ మూవీ రివ్యూ.. ఫన్ ఎక్కువ..ఫ్రస్టేషన్ తక్కువ..

వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ సినిమా రివ్యూ

వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ సినిమా రివ్యూ

F3 Movie Review : అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా మూడేళ్ల క్రితం 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఎఫ్ 3’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  రివ్యూ : F3  ఎఫ్ 3 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్ 3)
  నటీనటులు : వెంకటేష్,వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, తమన్నా,మెహ్రీన్ కౌర్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, రఘుబాబు, సంపత్ రాజ్,సునీల్ తదితరులు..
  ఎడిటర్: తమ్మి రాజు
  సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
  సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
  నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
  కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి

  అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా మూడేళ్ల క్రితం 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఎఫ్ 3’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

  కథ..

  డబ్బుకు లోకం దాసోహం, ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టు తిరుగుతోంది. డబ్బు కోసం ఆశపడే వెంకీ (వెంకటేష్), వరుణ్ (వరుణ్ తేజ్) లు దాని కోసం పడరాని పాట్లు పడతారు. వీళ్లను హారిక (తమన్నా ) తరుచు మోసం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో విజయ నగరంలో ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త (మురళీ శర్మ) తన తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో తామే ఆ వ్యాపారవేత్త వారసుడు అంటూ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నాతో పాటు వెన్నెల కిశోర్ ఒకరి తర్వాత మరొకరు ఆ వ్యాపారవేత్త ఇంట్లో ప్రవేశిస్తారు. మరి వీళ్లలో నిజంగా ఆ వ్యాపారవేత్త వారసుడు ఉన్నాడా ? ఈ క్రమంలో జరిగిన కథే ఎఫ్ 3 స్టోరీ.

  కథనం..

  కొన్ని సినిమాలకు బలమైన కథ  అవసరం. మరికొన్ని సినిమాలకు బలమైన స్క్రీన్ ప్లే ఉంటేనే ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయి. కానీ ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అంటూ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ మూవీకి లాంటి సినిమాకు కథ, స్క్రీన్ ప్లే వంటి  లాజిక్ అవసరం లేదు. కేవలం కామెడీ ఎంటర్టేనర్‌తో లాజిక్ దూరంగా  ప్రేక్షకులను అలరించవచ్చనే విషయాన్ని ఎఫ్ 3 మూవీతో మరోసారి దర్శకుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. కథ గురించి చూస్తే.. భూతద్దం పెట్టినా.. పెద్దగా ఏమి ఉండదు. అపుడెపుడే చూసినా.. పాత జంధ్యాల, ఈవీవీ సినిమాలను మిక్స్‌లో వేసి మిక్సర్ వేసి ఎఫ్3 అనే కొత్త సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో సన్నివేశాలు చూస్తుంటే.. అలనాటి పాత కామెడీ క్లాసిక్ సినిమాలు మనకు గుర్తుకు వస్తంటాయి. కొత్త సీసాలో పాత సారా అన్నట్లు .. తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను అలరించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో వెంకటేష్ పాత్రను చూస్తే..  బాలచందర్ గారి  ‘అంతులేని కథ’ టైపులో ముగ్గురు చెల్లెల్లు, ఒక తమ్ముడు, సవతి తల్లి, తండ్రి వంటి పాత్రలు గుర్తుకు వస్తాయి. అంత పెద్ద కుటుంబాన్ని పోషించే బాధ్యత అతనిపై ఉంటోంది. డబ్బు సంపాదన కోసం అతను ఎలాంటి పనులు చేస్తుండనేది చాలా ఫన్నీగా చూపించాడు. మరోవైపు ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రను అనాథ చూపిస్తాడు. ఇతను రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలని కలలు కనే పాత్ర. ఇతను పెద్దింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని షార్ట్‌కట్‌లో మిలియనీర్ కావాలనుకుంటాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరి సన్నివేశాలు ఇవివి ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాను గుర్తుకు తెస్తోంది.

  ఇక ఇంటర్వెల్ తర్వాత కోటీశ్వరుడి వారసులమంటూ పోలో మంటూ వెంకటేష్, వరుణ్ తేజ్,  వెన్నెల కిషోర తమన్నా మగ వేషం వేసుకొని పారిశ్రామివేత్త ఇంటికి వచ్చే సన్నివేశాలను అలనాటి జంధ్యాల, చిరంజీవి.. చంటబ్బాయి సినిమాతో పాటు బాలయ్య ‘గాండీవం’ సినిమాలను తలపిస్తాయి. కానీ ఈక్రమంలో కామెడీ డోస్ తగ్గడకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యడు. ఇంకోవైపు ప్రీ క్లైమాక్స్.. ఆ ఒక్కటి అడక్కు, ఆలీబాబా అరడజను వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. మొత్తంగా అనిల్ రావిపూడి పాత సీన్స్‌ను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అతని పాత సినిమాలనే ట్యూన్స్‌ను తలపిస్తాయి. కొత్తగా ఏమి లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరిపోయింది. ఫోటోగ్రపీ బాగుంది. ఎడిటర్.. ఇంటర్వెట్ తర్వాత ప్రీ క్లైమాక్స్‌ను ఇంకాస్తా ట్రిమ్ చేస్తే బాగుండేది. ఒక ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ‘బాహుబలి’, గబ్బర్ సింగ్, మహేష్ బాబు, అరవింద సమేత, పుష్ఫ వంటి ఎఫ్ 3 టాయ్స్ ఎపిసోడ్ ఆయా హీరోలను అభిమానులను అలరిస్తాయి. మొత్తంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారులు కాదు.. నీతిగా నిజాయితీగా సంపాదించేదే మనకు నిలుస్తుందనే సందేశానిచ్చాడు.

  ఇక హీరోగా వెంకటేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కామెడీని పండించడంలో ఆయన రూటే వేరు. ముఖ్యంగా కుటుంబ సమస్యలతో ఫస్ట్రేషన్‌కు గురయ్యే పాత్రలో జీవించాడు. ఇక ఇంటర్వెల్ తర్వాత బుల్ ఫైట్‌లో రోజావే చిన్ని రోజావే అంటూ సూర్యవంశంలోని అమాయకత్వం నటన.. క్టైమాక్స్‌లో నారప్పగా ఇరగదీయడం ప్రేక్షకులను కనెక్ట్ అవుతోంది. ముఖ్యంగా రే చీకటితో బాధ పడే పాత్రలో జీవించాడు.  అటు వరుణ్ తేజ్ కూడా నత్తితో బాధపడే పాత్రలో జీవించాడు. నత్తి కవర్ చేసుకోవడానికి తిప్పలు పడే పాత్రలో ఇరగదీసాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ ఒకరి ఎత్తులను చిత్తులు చేయడం వంటివి ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయి. ఇక తమన్నా కూడా మగవాడి గెటప్‌లో సరిగ్గా సూటైయింది. ఆమె ఇష్టపడే పాత్రలో సోనాల్ చౌహాన్, మరోసారి మెహ్రీన్.. హనీ ఈజ్ ది బెస్ట్ అనిపించలేకపోయింది. ఇతర పాత్రల్లో నటించిన మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, రఘుబాబు, సునీల్, ఆలీ, అన్నపూర్ణమ్మ, వై. విజయ,ప్రగతి కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మొత్తంగా లాజిక్ గురించి ఆలోచించకుండా సినిమా చూసే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోని బయటకు రావొచ్చు. మొత్తంగా సమ్మర్ సోగ్గాలు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తారనేది చూడాలి.

  ప్లస్ పాయింట్స్

  కామెడీ

  వెంకటేష్, వరుణ్ తేజ్‌ల నటన

  అనిల్ రావిపూడి దర్శకత్వం

  మైనస్ పాయింట్స్ 

  రొటీన్ కథ

  అంతగా కనెక్ట్ కానీ ఎమోషన్స్

  సెకండాఫ్

  రేటింగ్..2.75/5

  చివరి మాట : నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్..
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  రేటింగ్

  కథ:
  2/5
  స్క్రీన్ ప్లే:
  2.5/5
  దర్శకత్వం:
  3/5
  సంగీతం:
  2.5/5

  Tags: Anil Ravipudi, F3 Movie, F3 Movie Review, Tollywood, Varun Tej, Venkatesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు