F3 Movie : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఎఫ్ 3.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన..

F3 Release date Photo : Twitter

F3 Movie : అనిల రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే. కాగా ఈసినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న ఎఫ్3 విడుదలపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం.

 • Share this:
  F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది.  చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్.

  ఇక అది అలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌పై తాజాగా ప్రకటన విడుదలైంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించగా... తాజాగా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఎఫ్ 3 మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది 2022, ఫిబ్రవరి 25కు మార్చారు. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ అధికారిక ప్రకటిస్తూ.. 'బొమ్మ ఎప్పుడ పడితే అప్పుడే మనకు నవ్వుల పండగ' అంటూ మూవీ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

  Bigg Boss Telugu 5 : ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది.. ఇది షాకింగ్ విషయమే....

  దీంతో సినిమా విడుదలపై క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. అయితే వచ్చే సంక్రాంతికి ఇప్పటికే పవన్ కళ్యాణ్, రానా భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాట ఉన్నాయి. వీటితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల ఆర్ ఆర్ ఆర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలను కాస్తా వెనక్కు జరిపారు.

  ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్.


  ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి.

  ఈ యేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’ ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు వెంకటేష్ హీరోగా నటించిన మరో మూవీ ‘దృశ్యం 2’ మూవీ దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకోవైపు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది.
  Published by:Suresh Rachamalla
  First published: