పండగ సీజన్ సంక్రాంతికి ముందు మొదలైంది. జనవరి 9 నుంచి వరస సినిమాలు వస్తున్నా కూడా ఏది కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. జనవరి 12న వచ్చిన ‘ఎఫ్2’ మాత్రం పండగను తీసుకొచ్చింది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్2’ సినిమా తొలిరోజు 5 కోట్ల షేర్ వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 6 కోట్ల వరకు తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో కుమ్మేస్తుంది ఈ చిత్రం. అక్కడ రెండ్రోజుల్లోనే 6 లక్షల 50 వేల డాలర్లు వసూలు చేసింది ‘ఎఫ్2’.
ముఖ్యంగా వింటేజ్ వెంకటేశ్‌ను చూపించాడు అనిల్ రావిపూడి. ఆయన కామెడీ టైమింగ్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు జోరు చూస్తుంటే ఈ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా మారడం ఖాయంగా కనిపిస్తుంది. నైజాంలో ఏకంగా 1.73 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా 6 కోట్ల వరకు షేర్ తీసుకురావడంతో బయ్యర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. రెండో రోజు కూడా ఇదే స్థాయి కలెక్షన్లు రాబడుతుంది ‘ఎఫ్2’ సినిమా. కొన్ని ఏరియాల్లో అయితే తొలిరోజు కంటే ఎక్కువ వసూళ్లు తీసుకొస్తుంది ఈ చిత్రం.
ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 35 కోట్లు రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఈ చిత్రానికి ఉన్న టాక్ ప్రకారం అంత తీసుకురావడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. కచ్చితంగా పండగ సెలవులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం సేఫ్ జోన్‌కు వస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి అనిల్ రావిపూడి వరసగా నాలుగోసారి కూడా ప్రేక్షకులను మెప్పించాడు. మరి చూడాలి.. ‘ఎఫ్2’ ఎక్కడ ఆగుతుందో..?
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dil raju, Telugu Cinema, Tollywood, Varun Tej, Venkatesh