ముఖం మీద ఉమ్మేసినా కూడా సుధీర్ ప్రేమిస్తున్నాడు .. రష్మీ హాట్ కామెంట్స్ ..

సుడిగాలి సుధీర్

స్మాల్ స్క్రీన్ పై మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌ అని చెబుతారు చాలా మంది.

  • Share this:
    స్మాల్ స్క్రీన్ పై మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌ అని చెబుతారు చాలా మంది. వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వీళ్లే తర్వాతే ఎవరైనా.  ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే.నిజానికి సుధీర్ అనే పేరు వినిపించగానే రష్మీ గుర్తువస్తుంది. అలాగే రష్మీ టాపిక్ వస్తే అందులో కచ్చితంగా సుధీర్ గురించి ప్రస్తావన వస్తుంది. ఇంతలా అందరినీ ఈ జంట ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ కలిసి చేయకుండా షో చూడడం కొంచెం కష్టమే. అయితే వీరిద్దరిమధ్య ఏదో నడుస్తోందని గత కొన్నేళ్లుగా వింటూ వస్తున్నాం. ఈ ఎఫైర్స్ కారణంగానే సుధీర్‌కి పెళ్లి కావడం లేదని చెప్పుకుంటారు కొందరు. అయితే తమ ప్రేమాయణం గురించి రూమర్స్ బాగా పెరిగిపోతుండటంతో తాము ప్రేమలో లేమని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు రష్మీ,సుధీర్. దీంతో కొంతమేర వీరిద్దరి ప్రేమాయణంపై వార్తల ప్రవాహం తగ్గింది. అయితే ఇటీవల ఒక స్కిట్ లో రష్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

    Rashmi Gautam Sudigali Sudheer marriage,Rashmi Gautam Sudigali Sudheer pelli,Rashmi Gautam Sudigali Sudheer,Rashmi Gautam Sudigali Sudheer love story,Rashmi Gautam Sudigali Sudheer affair,Rashmi Gautam twitter,Sudigali Sudheer twitter,Rashmi Gautam hot photos,Sudigali Sudheer comedy skits,jabardasth skits,jabardasth comedy show,dhee jodi final,dhee champions new promo,dhee jodi,Rashmi Gautam Sudigali Sudheer dhee jodi final,jabardasth show,jabardasth couple Rashmi Gautam Sudigali Sudheer,extra jabardasth comedy show,jabardasth latest promo,telugu cinema,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో,ఢీ షో,ఢీ ఛాంపియన్ సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్
    రష్మీ, సుడిగాలి సుధీర్


    ఇటీవల ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే పేరు మీద సుడిగాలి సుధీర్ స్కిట్ చేశాడు. ఈ స్కిట్‌లో ప్రదీప్ కూడా ఉన్నాడు. ఈ స్కిట్ లో భాగమైన రష్మీ.. ప్రదీప్‌తో సుధీర్ గురించి చెబుతూ సంచలనం సృష్టించింది.తనను సుధీర్ ఏడేళ్లుగా ప్రేమిస్తున్నాడని, వాడిని ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదని ప్రదీప్‌తో చెబుతుంది రష్మీ. అంతటితో ఆగక, ఛీ అన్నా, చెప్పుతో కొట్టినా, ముఖం మీద ఉమ్మేసినా కూడా సుధీర్ తనను ప్రేమిస్తూనే ఉన్నాడు. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ వాపోయింది.అయితే రష్మి ఏ ఉద్దేశంతో  అలా అందో కానీ ఇపుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏమైనా వీరిద్దరి మధ్య ఏ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ అయిపోతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: