వ్యవసాయం చేస్తానంటున్న రష్మీ గౌతమ్.. కొత్తగా భూములు కొన్న జబర్థస్త్ భామ.. ?

Rashmi Gautam | తెలుగు టీవీ  ఛానెల్స్ చూసే ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. . తాజాగా ఈమె టీవీల్లో సంపాదించిన డబ్బుతో ఒడిశాలో భూములు కొన్నట్టు సమాచారం

news18-telugu
Updated: February 20, 2020, 10:38 AM IST
వ్యవసాయం చేస్తానంటున్న రష్మీ గౌతమ్..  కొత్తగా భూములు కొన్న జబర్థస్త్ భామ.. ?
రష్మీ గౌతమ్ (Twitter/Photo)
  • Share this:
తెలుగు టీవీ  ఛానెల్స్ చూసే ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. తెలుగు స్పష్టంగా రాకపోయినా.. తనదైన శైలిలో తెలుగు టీవీ తెరపై యాంకర్‌గా రాణిస్తోంది. కేవలం  అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈమె టీవీల్లో సంపాదించిన డబ్బుతో ఒడిశాలో భూములు కొన్నట్టు సమాచారం. ఎంత అమౌంట్‌కు ఎన్ని ఎకరాలు కొన్న విషయం మాత్రం స్పష్టం లేదు. కానీ ఈ కొన్న భూముల్లో రష్మీ గౌతమ్ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఫిక్స్ అయింది. అంతేకాదు ఈ కొన్ని పొలాన్ని కౌలు ఇచ్చి సాగు చేయాలనే ఆలోచనలో ఉందట. ఇక యాంకర్‌గా కెరీర్ మహా అయితే.. మరో ఐదేళ్లు ఉండోచ్చు. ఆ తర్వాత తాను కొన్న వ్యవసాయ భూమిలో ఎంచక్కా వ్యవసాయం చేసుకోవాలనదే తన కోరిక అన్నట్టు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించిందట.

rashmi gautam latest pics, rashmi gautam, rashmi gautam jabardasth, rashmi, jabardasth anchor rashmi, rashmi gautam age, rashmi gautam real life, జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్, రష్మీ గౌతమ్ పిక్స్
రష్మీ గౌతమ్


తాను కొన్న వ్యవసాయ భూముల్లో రష్మీ ఎక్కువగా కోకా, మామిడి, నేరేడు వంటి పండ్లకు సంబంధించిన పంటలను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తాజాగా రష్మీ గౌతమ్ ఈ వ్యవసాయ భూముల్లో తన పెంపుడు కుక్కతో షికారుకు కూడా వెళ్లింది. ఆ ఫోటోలను రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. రష్మీ గౌతమ్ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులోని బెహ్రాంపూర్‌లో జన్మించింది. మొత్తానికి రష్మీ గౌతమ్.. తన ఫ్యూచర్ గురించి ముందే ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుందని ఆమెను అభినందిస్తున్నారు. మరి రష్మీ గౌతమ్.. ఈ భూముల వ్యవహారంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మరి నిజంగానే రష్మీ గౌతమ్.. అంతలా వ్యవసాయ భూములు కొన్నదా అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.
First published: February 20, 2020, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading