హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudheer- Roja: సుడిగాలి సుధీర్ పేరును మార్చిన రోజా

Sudigali Sudheer- Roja: సుడిగాలి సుధీర్ పేరును మార్చిన రోజా

సుధీర్, రోజా (Image: Youtube)

సుధీర్, రోజా (Image: Youtube)

Roja- Sudigali Sudheer: బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న వారిలో సుడిగాలి సుధీర్ ఒక‌రు. ఒక‌ప్పుడు మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్.. ఆ త‌రువాత నిదానంగా బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చారు. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా సుధీర్‌కి మంచి పేరు రాగా.. హోస్ట్‌గా, డ్యాన్స‌ర్‌గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు

ఇంకా చదవండి ...

  Roja- Sudigali Sudheer: బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న వారిలో సుడిగాలి సుధీర్ ఒక‌రు. ఒక‌ప్పుడు మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్.. ఆ త‌రువాత నిదానంగా బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చారు. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా సుధీర్‌కి మంచి పేరు రాగా.. హోస్ట్‌గా, డ్యాన్స‌ర్‌గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక హీరోగా ఇప్ప‌టికే రెండు చిత్రాల్లో సుధీర్ న‌టించారు. అయితే అవి పెద్ద విజ‌యం సాధించ‌క‌పోగా.. హీరోగా త‌న అదృష్టాన్ని ఇంకా ప‌రీక్షించుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం కాలింగ్ స‌హ‌స్త్ర అనే థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా సుధీర్ పేరు సుడిగాలి సుధీర్‌గా మారింది. ఈ పేరుతోనే ఇప్పుడు టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు సుధీర్. అయితే ఈ షోకు జ‌డ్జిగా చేసే రోజా ఇప్పుడు సుధీర్ పేరును మార్చారు.

  వ‌చ్చే వారం ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కి సంబంధించి తాజాగా ప్రోమో విడుద‌ల అయ్యింది. అందులో సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ వ‌చ్చే స‌మ‌యంలో సుడిగాలి సుధీర్ కాదు సొరంగాల సుధీర్ అని పెట్టాలి అంటూ అత‌డిపై రోజా పంచ్ వేశారు. అయితే సుధీర్‌పై త‌ర‌చుగా రోజా పంచ్‌లు వేస్తూ ఉంటారు. అయితే వాటిని సుధీర్ చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటాడు. అంతేకాదు త‌న‌పై జోకులు వేసే స‌మ‌యంలోనూ న‌వ్వుతూ ఉంటాడు. ఈ క్ర‌మంలో సుధీర్ స్పోర్టివ్‌నెస్‌ని చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు.

  కాగా రానున్న ఎపిసోడ్‌కి నాంది ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌లతో పాటు హీరో అల్ల‌రి న‌రేష్ రానున్నారు. ఈ సంద‌ర్భంగా రోజాను ఎత్తుకొని అల్ల‌రి న‌రేష్ డ్యాన్స్ వేశారు. ఇక తాను కామెడీ చిత్రాల్లో న‌టిస్తాన‌ని, కానీ కామెడీ చేయ‌లేన‌ని అల్ల‌రి న‌రేష్ అన్నారు.

  Published by:Manjula S
  First published:

  Tags: Roja, Sudigali sudheer

  ఉత్తమ కథలు