HOME »NEWS »MOVIE »extra jabardast promo immanuel kiss varsha infront of roja mnj

Extra Jabardash- Varsha- Immanuel: సెట్లో అందరి ముందే వర్షతో ఆ పని చేసిన ఇమ్మాన్యుల్‌

Extra Jabardash- Varsha- Immanuel: సెట్లో అందరి ముందే వర్షతో ఆ పని చేసిన ఇమ్మాన్యుల్‌
ఇమ్మాన్యుయేల్, వర్ష (Image: youtube)

ఈ కామెడీ ప్రోగ్రామ్‌లో ఇటీవ‌ల బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఇమ్మాన్యుల్(Immanuel). ముందు నుంచే ఇమ్మాన్యుల్ ఉన్న‌ప్ప‌టికీ.. అవినాష్ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన త‌రువాత కార్తీక్(Kevvu Karthik) టీమ్‌లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఆ త‌రువాత త‌న కామెడీ టైమింగ్‌తో అద‌ర‌గొట్టేస్తూ వ‌చ్చాడు. అయితే ఇతడికి పెయిర్‌గా వ‌ర్ష వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి.. ఇమ్ముకు మ‌రింత క్రేజ్ పెరిగిపోయింది.

  • Share this:
    Extra Jabardash- Varsha- Immanuel: తెలుగు బుల్లితెర‌పై టాప్ కామెడీ ప్రోగ్రామ్‌గా దూసుకుపోతోంది జ‌బ‌ర్ద‌స్త్. ఈటీవీలో వ‌చ్చే ఈ ప్రోగ్రామ్‌ జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లుగా రెండు రోజులు అంద‌రికీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని పంచుతుంది. ఈ ప్రోగ్రామ్‌కు పోటీగా మిగిలిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల వాళ్లు ఇలాంటి ప్రోగ్రామ్‌లనే పెట్టిన‌ప్ప‌టికీ.. వారు పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయారు. ఇక ఈ షో ఎంతోమంది క‌మెడియ‌న్ల‌కు లైఫ్‌ని ఇవ్వ‌గా.. ఇందులో పాల్గొని పేరు తెచ్చుకున్న క‌మెడియ‌న్లు సినిమాల్లోనూ దూసుకుపోతున్నారు. కాగా ఈ కామెడీ ప్రోగ్రామ్‌లో ఇటీవ‌ల బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఇమ్మాన్యుల్. ముందు నుంచే ఇమ్మాన్యుల్ ఉన్న‌ప్ప‌టికీ.. అవినాష్ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన త‌రువాత కార్తీక్ టీమ్‌లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఆ త‌రువాత త‌న కామెడీ టైమింగ్‌తో అద‌ర‌గొట్టేస్తూ వ‌చ్చాడు. అయితే ఇతడికి పెయిర్‌గా వ‌ర్ష వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి.. ఇమ్ముకు మ‌రింత క్రేజ్ పెరిగిపోయింది.

    వీరిద్ద‌రి కాంబినేష‌న్ బ్లాక్ అండ్ వైట్‌గా పేరు తెచ్చుకుంది. జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్‌పై సుధీర్, ర‌ష్మి జోడీని ఇంత‌వ‌ర‌కు ఎవ్వ‌రూ ఢీ కొట్ట‌లేదు. అయితే వారిద్ద‌రికి ఇమ్మాన్యుల్, వ‌ర్ష గ‌ట్టి పోటీని ఇస్తూ వ‌స్తున్నారు. త‌న అందాన్ని ఓ రేంజ్‌లో ఊహిస్తూ ఇమ్మాన్యుల్ మాట్లాడే మాట‌లు.. ఇమ్ము ఇమ్ము అంటూ వ‌ర్ష చెప్పే డైలాగ్‌లు.. వీరిద్ద‌రి రొమాన్స్ అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో ఈ జోడీకి మంచి క్రేజ్ వ‌చ్చింది. అంతేకాదు కార్తీక్ కూడా చాలా సార్లు విన్న‌ర్‌గా నిలిచాడు.



    ఇదంతా ప‌క్క‌న‌పెడితే ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కి సంబంధించి ఓ కొత్త ప్రోమో విడుద‌ల అయ్యింది. ర‌వితేజ ఇడియ‌ట్ మూవీ స్ఫూస్‌తో కార్తీక్ టీమ్ ఓ స్కిట్‌ని చేస్తోంది. అందులో ఈ సారి ఇమ్మాన్యుల్‌ని వ‌ర్ష‌కు నాన్న‌కు చేశారు. . ఇక ఇందులో వ‌ర్ష‌, ఇమ్మాన్యుల్‌ని నాన్న నాన్న పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇమ్మాన్యుల్ కాస్త ఫీల్ అయిన‌ట్లుగా ఉంటాడు. అయితేనేం కూతురువి రా అంటూ సెట్‌లో అంద‌రూ చూస్తుండ‌గానే వ‌ర్ష‌కు ముద్దులు పెట్టేస్తాడు. దీంతో అక్క‌డున్న వారు కూడా షాకింగ్‌గా ఉంటుంది. కాగా ఈ ప్రోమోకు వీక్ష‌కుల‌కు మిశ్ర‌మంగా కామెంట్లు పెడుతున్నారు. కొంద‌రేమో వీళ్లు శ్రుతి మించుతున్నార‌ని కామెంట్లు పెడుతుండ‌గా.. మ‌రికొంద‌రు వ‌ర్ష- ఇమ్ము జోడీ సూప‌ర్ అంటూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.
    Published by:Manjula S
    First published:January 16, 2021, 12:09 IST