• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • EXTRA JABARDAST PROMO EMMANUEL SHOWS HER LOVE ON VARSHA CONVEYS VALENTINES DAY WISHES MNJ

Emmanuel- Varsha: నా కలర్ ని చూసి ఎవ్వరూ నా పక్కన నిల్చులేదు.. వర్ష గురించి ఇమ్మాన్యుల్ భావోద్వేగం

Emmanuel- Varsha: నా కలర్ ని చూసి ఎవ్వరూ నా పక్కన నిల్చులేదు.. వర్ష గురించి ఇమ్మాన్యుల్ భావోద్వేగం

ఇమ్మాన్యుయేల్, వర్ష (Image: youtube)

Emmanuel- Varsha: ప్ర‌ముఖ కామెడీ షో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటీవ‌ల బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఇమ్మాన్యుల్. ఆ మ‌ధ్య ఎప్పుడో జ‌బ‌ర్ద‌స్త్‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ముక్కు అవినాష్ వెళ్లిన త‌రువాత కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఇమ్మాన్యుల్‌కి మంచి స్థానం లభించింది. ఇక త‌నదైన డైలాగ్ డెలివరీతో రెచ్చిపోయిన ఇమ్మాన్యుల్.. చాలా సార్లు కార్తీక్ స్కిట్‌ని గెలిపించారు.

  • Share this:
    Emmanuel- Varsha: ప్ర‌ముఖ కామెడీ షో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటీవ‌ల బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఇమ్మాన్యుల్. ఆ మ‌ధ్య ఎప్పుడో జ‌బ‌ర్ద‌స్త్‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ముక్కు అవినాష్ వెళ్లిన త‌రువాత కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఇమ్మాన్యుల్‌కి మంచి స్థానం లభించింది. ఇక త‌నదైన డైలాగ్ డెలివరీతో రెచ్చిపోయిన ఇమ్మాన్యుల్.. చాలా సార్లు కార్తీక్ స్కిట్‌ని గెలిపించారు. ఇక సుధీర్ టీమ్‌కి కూడా బాగా గ‌ట్టి పోటీని ఇచ్చాడు ఇమ్మాన్యుల్. త‌న అందాన్ని ఓ రేంజ్‌లో ఊహిస్తూ ఇమ్మాన్యుల్ మాట్లాడే మాట‌లు జ‌బ‌ర్ద‌స్త్ వీక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఈ షోలో ఇమ్మాన్యుల్ పాపులారిటీ సంపాదించుకోవ‌డానికి మరో కార‌ణం వ‌ర్ష‌. ఇటీవ‌లే జ‌బ‌ర్ద‌స్త్‌లోకి వ‌చ్చిన వ‌ర్ష కూడా త‌న ప‌ర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టేస్తోంది. ముఖ్యంగా ఇమ్మాన్యుల్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా న‌టించ‌డంతో పాటు అత‌డితో రొమాన్స్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌టం లేదు. ఈ క్ర‌మంలో జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్‌పై సుధీర్, ర‌ష్మి జోడీకి సైతం ఇమ్మాన్యుల్, వ‌ర్ష గ‌ట్టి పోటీని ఇస్తూ వ‌స్తున్నారు.

    ఇక జ‌బ‌ర్ద‌స్త్ షోలో మాత్ర‌మే కాదు ప‌లు షోల‌లో కూడా వీరిద్ద‌రు జోడీ క‌డుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ అంటూ ప‌లువురు కామెంట్లు చేసినప్ప‌టికీ వీరిద్దరు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. స‌మ‌యం, సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడల్లా ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను చూపిస్తూ వ‌స్తున్నారు. ఇక తాజాగా మ‌రోసారి వ‌ర్ష‌పై ప్రేమ‌ను చాటారు ఇమ్మాన్యుల్.


    తాజాగా విడుద‌ల చేసిన ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో జ‌డ్జి రోజా ప‌ర్మిష‌న్ తీసుకున్న ఇమ్మాన్యుల్, వ‌ర్ష‌కు స‌ర్‌ప్రైజ్ ఇవ్వాల‌నుకుంటున్నానని తెలిపాడు. అందుకు రోజా ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంతో వ‌ర్ష‌ను స్టేజ్‌పైకి పిలిచే ఇమ్మాన్యుల్.. వాలెంటైన్స్ డే విషెస్ చెబుతాడు. ఇక త‌న క‌ల‌ర్‌ని చూసి చిన్న‌ప్ప‌టి నుంచి ఎవ్వ‌రూ ప‌క్క‌న ఉండేవారు కాద‌ని, కానీ వ‌ర్ష త‌న‌తో పాటు చేసింద‌ని భావోద్వేగానికి గుర‌య్యాడు ఇమ్మాన్యుల్.
    Published by:Manjula S
    First published: