• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • EXTRA JABARDAST EMMANUEL KISSES VARSHA SO MANY TIMES IN SKIT NETIZENS MIXED REACTIONS MNJ

Emmanuel- Varsha: అమ్మా ఇమ్మాన్యుయలూ.. స్క్రిప్ట్ పేరు చెప్పి రెచ్చిపోయాడుగా.. వర్షకు ముద్దుల వర్షం..!

Emmanuel- Varsha: అమ్మా ఇమ్మాన్యుయలూ.. స్క్రిప్ట్ పేరు చెప్పి రెచ్చిపోయాడుగా.. వర్షకు ముద్దుల వర్షం..!

ఇమ్మాన్యుయేల్, వర్ష (Image: youtube)

ప్ర‌ముఖ కామెడీ షో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటీవ‌ల బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఇమ్మాన్యుల్(Emmanuel). ఆ మ‌ధ్య ఎప్పుడో జ‌బ‌ర్ద‌స్త్‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ముక్కు అవినాష్ వెళ్లిన త‌రువాత కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఇమ్మాన్యుల్‌కి మంచి స్థానం లభించింది.

  • Share this:
    Emmanuel- Varsha: ప్ర‌ముఖ కామెడీ షో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటీవ‌ల బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఇమ్మాన్యుల్. ఆ మ‌ధ్య ఎప్పుడో జ‌బ‌ర్ద‌స్త్‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ముక్కు అవినాష్ వెళ్లిన త‌రువాత కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఇమ్మాన్యుల్‌కి మంచి స్థానం లభించింది. ఇక త‌నదైన డైలాగ్ డెలివరీతో రెచ్చిపోయిన ఇమ్మాన్యుల్.. చాలా సార్లు కార్తీక్ స్కిట్‌ని గెలిపించారు. ఇక సుధీర్ టీమ్‌కి కూడా బాగా గ‌ట్టి పోటీని ఇచ్చాడు ఇమ్మాన్యుల్. త‌న అందాన్ని ఓ రేంజ్‌లో ఊహిస్తూ ఇమ్మాన్యుల్ మాట్లాడే మాట‌లు జ‌బ‌ర్ద‌స్త్ వీక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఈ షోలో ఇమ్మాన్యుల్ పాపులారిటీ సంపాదించుకోవ‌డానికి మరో కార‌ణం వ‌ర్ష‌. ఇటీవ‌లే జ‌బ‌ర్ద‌స్త్‌లోకి వ‌చ్చిన వ‌ర్ష కూడా త‌న ప‌ర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టేస్తోంది. ముఖ్యంగా ఇమ్మాన్యుల్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా న‌టించ‌డంతో పాటు అత‌డితో రొమాన్స్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌టం లేదు. ఈ క్ర‌మంలో జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్‌పై సుధీర్, ర‌ష్మి జోడీకి సైతం ఇమ్మాన్యుల్, వ‌ర్ష గ‌ట్టి పోటీని ఇస్తూ వ‌స్తున్నారు.

    అయితే ఇటీవ‌ల ఓ స్కిట్‌లో వ‌ర్ష‌తో ఇమ్మాన్యుల్ మ‌రింత రెచ్చిపోయాడు. స్క్రిప్ట్ పేరు చెప్పి వ‌ర్ష‌పై ముద్దుల వ‌ర్షం కురిపించాడు. ఇదంతా స్కిట్‌లో లేద‌ని వ‌ర్ష చాలా సార్లు అత‌డిని కొట్టిన‌ప్ప‌టికీ వ‌ద‌ల్లేడు. వ‌ర్ష‌కు నాన్న కారెక్ట‌ర్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. స‌మ‌యం చిక్కిన‌ప్పుడల్లా ఆమెకు ముద్దు పెడుతూనే ఉన్నాడు. ఇదంతా చూసేందుకు కాస్త ఇబ్బందిగా కూడా అనిపిస్తోంది.

    ఇక ఈ వీడియోపై నెటిజ‌న్లు కూడా మిశ్ర‌మంగా స్పందిస్తున్నారు. ఇమ్మాన్యుల్, వ‌ర్ష రెచ్చిపోతున్నార‌ని.. చూసేందుకు ఇబ్బందిగా ఉంద‌ని కొంద‌రు కామెంట్లు పెడుతుండ‌గా.. మ‌రికొంద‌రు ఇమ్ము-వ‌ర్ష జోడీ బావుంద‌ని అంటున్నారు. ఇంకొంద‌ర‌మేమో వీరిద్ద‌రు హ‌ద్దు మీరుతున్నారంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు