అవును.. మీరు చూసింది.. చదివింది నిజమే. అఖిల్ (Akhil Akkineni) సినిమాలో నిజంగానే మెగాస్టార్ (Megastar) కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రయూనిట్. అది చూసిన తర్వాత అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. సురేందర్ రెడ్డి (Surender Reddy) తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ సూపర్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసమే తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. 8 ప్యాక్ చేసి అదిరిపోయే మేకోవర్ అయ్యాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) సినిమాతో మొదటి హిట్ కొట్టిన అక్కినేని వారసుడు.. ఇప్పుడు ఏజెంట్ (Agent) తో మరో విజయంపై కన్నేసాడు. పైగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. స్టైలిష్ మేకర్‌గా పేరున్న ఈయన.. సైరా లాంటి హిస్టారికల్ సినిమా తర్వాత చేస్తున్న చిత్రమిది.
ఏజెంట్‌పై అక్కినేని అభిమానుల్లో మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రం కచ్చితంగా విజయం అందుకుంటుందని అఖిల్ కూడా ధీమాగా ఉన్నాడు. అందుకే సురేందర్ రెడ్డి అడిగినట్లుగానే సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యాడు. ఆయన మారిపోయిన తీరు చూస్తేనే.. సినిమా కథ ఎంతగా నచ్చిందో అర్థం అయిపోతుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర (Anil Sunkara) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వక్కంతం వంశీ (Vakkantham Vamshi) కథ అందిస్తున్నాడు. ధృవ (Dhruva) సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ ఇప్పుడు విడుదల చేసారు. ది డెవిల్.. రూత్‌లెస్ సేవియర్ అంటూ విడుదలైన పోస్టర్ అదిరిపోయింది. ఏజెంట్‌లో సైనికుడిగా నటిస్తున్నాడు మమ్ముట్టి.
A Stalwart of Indian Cinema who paved his own path with Discipline & Dedication ?
— AK Entertainments (@AKentsOfficial) March 7, 2022
Megastar @mammukka?Joins the shoot of #AGENT ⚡️
Can’t wait to witness the magic on sets ❤️@AkhilAkkineni8 @DirSurender @AnilSunkara1 @VamsiVakkantham@hiphoptamizha @AKentsOfficial @S2C_Offl pic.twitter.com/pmVv474Vnz
అప్పుడెప్పుడో స్వాతి కిరణం తర్వాత తెలుగు సినిమాల వైపు పెద్దగా చూడని మమ్ముట్టి.. ఈ మధ్యే యాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు మరోసారి అఖిల్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదివరకు టీవీ కమర్షియల్స్‌లో నటించిన ఈ బ్యూటీ.. మొదటి సారి తెలుగు సినిమాలో నటిస్తుంది. అఖిల్ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. ఇదివరకు సయేషా సైగల్, కళ్యాణి ప్రియదర్శన్ కూడా అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొత్తానికి అఖిల్ సినిమాలో మెగాస్టార్ మమ్ముట్టి ఎంట్రీతో సినిమాకు మలయాళంలో కూడా మైలేజ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇదే ఏడాది ఏజెంట్ విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.