జానీడెప్‌ని రాక్షసుడితో పోల్చిన మాజీ భార్య... ఎందుకంటే...

హాలీవుడ్ స్టార్ హీరో... పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్ సెన్సేషనల్ నటుడు జానీ డెప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన మాజీ భార్య అంబర్ హియర్డ్. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలు లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు టాఫ్ ఆఫ్ ది హాలీవుడ్ అయ్యాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: January 6, 2019, 2:35 PM IST
జానీడెప్‌ని రాక్షసుడితో పోల్చిన మాజీ భార్య... ఎందుకంటే...
అంబర్ హియర్డ్, జానీ డెప్ (ఫైల్ ఫొటో)
  • Share this:
జానీడెప్‌ని ఆ పేరుతో కంటే... పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' హీరో అంటే ఈజీగా తెలిసిపోతుంది. రీల్‌పై ఎలా ఉన్నా... రియల్‌లైఫ్‌లో ఆయనపై ఎన్నో వివాదాలున్నాయి. ఇప్పుడు ఆయన ఎక్స్ వైఫ్ అంబర్ హియర్డ్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జానీ ఓ రాక్షసుడు అన్న ఆమె... తనకు నరకం చూపించాడనీ, తీవ్రంగా హింసించాడంటూ కోర్టుకు సమర్పించిన ఆరోపణా పత్రాలు బయటికొచ్చాయి. 2016లోనే విడాకులకు అప్లై చేసిన ఆమె... ఆ కేసుపై కోర్టు విచారణలో జానీ డెప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ... పత్రాలు సమర్పించింది.

జానీ డెప్, అంబర్ హియర్డ్, జానీడెప్ అంబర్ హియర్డ్, johnny depp, johnny depp 2018, johnny depp interview, depp, johnny, johnny depp movies, johnny depp amber heard, johnny depp jack sparrow, johnny depp funny moments, johnny depp drunk, johnny depp ellen, johnny depp guitar, johnny
అంబర్ హియర్డ్, జానీ డెప్ (ఫైల్ ఫొటో)


మహిళా ధ్వేషి?
ఓ నటుడిగా జానీడెప్‌కి వీపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో ఆయన వేసే పాత్రలు, చేసే నటనకు కోట్ల మంది ఫిదా అయ్యారు. అలాంటి ఆర్టిస్ట్ రియల్ లైఫ్‌‌లో పరమ క్రూరుడని అంబర్ ఆరోపణలను బట్టీ అర్థమవుతోంది. మహిళల్ని వేధించే వాళ్ల జాబితాలో ఆయన కూడా చేరిపోయాడు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా జానీ డెప్‌కి వ్యతిరేక కథనాల్ని ప్రచురిస్తూ దుమ్మెత్తిపోస్తోంది. ఇంతకు ముందు కొన్ని పత్రికలపై జానీ పరువునష్టం దావా వేశాడు. అంబర్ ఆరోపణలకు ఏం సమాధానం చెబుతావంటూ ఆ పత్రికలు ఇప్పుడు రివెంజ్ స్టోరీలతో విరుచుకుపడుతున్నాయి.

జానీ డెప్, అంబర్ హియర్డ్, జానీడెప్ అంబర్ హియర్డ్, johnny depp, johnny depp 2018, johnny depp interview, depp, johnny, johnny depp movies, johnny depp amber heard, johnny depp jack sparrow, johnny depp funny moments, johnny depp drunk, johnny depp ellen, johnny depp guitar, johnny
జానీ డెప్ (ట్విట్టర్)


క్రేజీ మార్కెటింగే రాక్షసుడిలా మార్చిందా?
జానీడెప్‌ రాన్రానూ ఎలా తయారయ్యాడంటే... తను చెప్పిందే జరగాలి, తను చేసిందే కరెక్ట్ అన్నట్లు మారిపోయాడు. ఈ విపరీత ప్రవర్తన నచ్చక ఆయన్ని పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నెక్ట్స్ సిరీస్ నుంచీ తొలగించింది డిస్నీ సంస్థ. షాకింగ్ విషయమేంటంటే... ఈ సీక్వెల్ చేసివుంటే... జానీ డెప్ రూ.700 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేవాడే. ఆ రేంజ్‌లో లాగేస్తున్న ఆయన్ని తొలగించడమే మంచిదంటున్నాయి జానీ వ్యతిరేక వర్గాలు. తాజా ఆరోపణలతో జానీ డెప్ బ్రాండ్ వాల్యూ మరింత పడిపోవడం ఖాయమంటోంది హాలీవుడ్.

ఇవి కూడా చదవండి:


ప్రపంచ మొట్టమొదటి కంప్లీట్ త్రీడీ ప్రింటెడ్ ఎలక్ట్రిక్ బైక్...


ప్ర‌జారాజ్యం ఫ్లాప్.. జనసేనతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రివేంజ్ డ్రామా..


వావ్ హౌ రొమాంటిక్.. వ‌ర్మ బుగ్గ గిల్లిన త్రిష‌..

First published: January 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading