EX MINISTER NARA LOKESH INTERESTING COMMENTS ON JR NTR AND HIS POLITICAL ENTRY INTO TDP PK
టీడీపీ ఒక్కరి సొత్తు కాదు.. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై నారా లోకేష్ సంచలనం..
నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ వస్తాడా రాడా..? ఆయన మళ్ళీ రాజకీయాల్లో బిజీ అవుతాడా లేదా.. పదేళ్ల కిందే పార్టీ కోసం పని చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ వస్తాడా అనే ఆసక్తికరమైన చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ వస్తాడా రాడా..? ఆయన మళ్ళీ రాజకీయాల్లో బిజీ అవుతాడా లేదా.. పదేళ్ల కిందే పార్టీ కోసం పని చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ వస్తాడా అనే ఆసక్తికరమైన చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. నిజానికి ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన్ని మళ్లీ ప్రచారం వైపు తీసుకురావాలని చూసినా కూడా అందుకు జూనియర్ నిరాకరించాడు. భవిష్యత్తులో పార్టీకి అవసరం అయినపుడు తప్పకుండా వస్తానంటూ ఇప్పటికి తప్పించుకున్నాడు ఎన్టీఆర్. తాత పెట్టిన పార్టీ కోసం ప్రాణం ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉంటానని గతంలోనే చెప్పాడు జూనియర్.
చంద్రబాబు నాయుడు,జూ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం ఉనికి కూడా ప్రమాదంలో పడేలా ఓడిపోవడంతో నెక్ట్స్ ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయనే ప్రశ్నలు జోరుగా నడుస్తున్న సమయంలోనే.. జూనియర్ ప్రస్థావన మళ్లీ మళ్లీ వస్తుంది. ఇప్పుడున్న సమయంలో యువ నాయకుడు కావాలని.. అతడు ఎన్టీఆర్ అయి ఉండాలని పార్టీలోని కొందరు సీనియర్లు బాబుగారికి సూచించినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతికి వచ్చినపుడు కూడా ఎన్టీఆర్ రాకపై చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించాడని ప్రచారం జరిగింది.
నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతిలో చంద్రబాబునాయుడు, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్
మొన్నటికి మొన్న బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ మాత్రం ఎన్టీఆర్ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం పార్టీ కోసం పని చేయడానికి తామంతా ఉన్నామని.. ఇప్పటికప్పుడు జూనియర్ రావాల్సినంత అవసరం పార్టీకి ఏం లేదని సంచలన కమెంట్స్ చేసాడు. ఈయన కమెంట్స్పై విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు నారా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాకపై ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసాడు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఈయన.. ఎన్టీఆర్ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య చిన్నల్లుడు భరత్ (File Photo)
తెలుగుదేశంలోకి ఎన్టీఆర్ రాకపై మీ స్పందనేంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీ ఎవరో ఒక్కరి సొత్తు కాదు.. ఇక్కడంతా పార్టీ కోసం పని చేసేవాళ్లే ఉన్నారు.. ఎవరైనా వచ్చి పని చేయొచ్చు.. జూనియర్ కూడా దీనికి మినహాయింపు కాదని తెలిపాడు లోకేష్. చినబాబు మాటలను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ వచ్చినా రాకపోయినా పార్టీలో ఎలాంటి సమస్యా లేదన్నట్లు అనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా పార్టీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.