Chammak Chandra: జబర్దస్త్ నుంచి వెళ్లినా.. చమ్మక్ చంద్ర బాగానే సంపాదిస్తున్నాడుగా..!

చమ్మక్ చంద్ర (Chammak Chandra)

Chammak Chandra: జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామజపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో ఆయనతో..

  • Share this:
జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామజపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో ఆయనతో పాటే జీ తెలుగుకు వచ్చాడు చంద్ర. ఆయన వెళ్లిపోవడంతో జబర్దస్త్ కామెడీ షోలో ఫ్యామిలీ స్కిట్స్‌పై కచ్చితంగా ఎంతోకొంత దెబ్బ అయితే పడటం ఖాయం. ఇప్పటికీ ఆ ప్రభావం అయితే కనిపిస్తుంది. జబర్దస్త్ కామెడీ షోలో చంద్ర లేకపోవడంతో ఆ లోటు భర్తీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు. ముఖ్యంగా సత్తిపండుతో ఆయన స్థానం భర్తీ చేయాలని జబర్దస్త్ నిర్వాహకులు భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చంద్ర లేని లోటు మాత్రం జబర్దస్త్ కామెడీ షోలో అలాగే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఆయన వెళ్లిన అదిరింది షో కూడా ఆగిపోయింది. ఓ సీజన్ ముగిసిపోవడంతో రెండో సీజన్ కోసం వేచి చూస్తున్నారు కమెడియన్స్. ఈ లోపు స్టార్ మాలో మొదలైన కామెడీ స్టార్స్‌లోకి వెళ్లిపోయాడు చంద్ర. ఇదిలా ఉంటే మొదటి నుంచి కూడా చమ్మక్ చంద్ర అందరికంటే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చాడు. తొలిరోజు నుంచి కూడా ఇప్పటి వరకు పక్కా ప్లానింగ్‌తోనే ఆయన ముందుకు వెళ్తున్నాడు. స్కిట్స్ ఉన్నా లేకపోయినా.. జబర్దస్త్ మానేసినా కూడా తనకంటూ ఆర్థికంగా సంపాదించుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షోలో అందరికంటే ఎక్కువ ఆస్తులు చమ్మక్ చంద్రతోనే ఉన్నాయని అప్పట్లో నాగబాబు కూడా చెప్పాడు.

Chammak Chandra reveled the reasons behind why he was quit Jabardasth Comedy Show pk జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామజపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో.. jabardasth,jabardasth skits,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో


పక్కా ప్లానింగ్‌తో చాలా బాగా సంపాదించుకున్నాడని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌లో చంద్రకు సొంతిల్లు ఉంది. దాని విలువ కోటిపైనే ఉంటుంది. అలాగే ఓ బిఎండబ్ల్యూ కారు కూడా ఉంది. దాంతో పాటు మరికొన్ని ప్రాపర్టీస్ కూడా కొన్నాడు చంద్ర. అంతేకాదు ఊళ్లో కూడా ఈయనకు ఆస్తులున్నాయి. జబర్దస్త్ కామెడీ షోలో హైయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా ఉన్నాడు చంద్ర. ఆ తర్వాత అదిరిందికి వెళ్లినపుడు కూడా దాదాపు ఒక్కో స్కిట్‌కు 4 లక్షల కంటే పైగానే తీసుకున్నాడు ఈయన. అలాగే సినిమాలు కూడా చేస్తున్నాడు చమ్మక్ చంద్ర.

Chammak Chandra skits, Chammak Chandra news, Jabardasth, Extra jabardasth, Adhirindi, bomma adhirindi, చమ్మక్ చంద్ర, చమ్మక్ చంద్ర న్యూస్, జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్, బొమ్మ అదిరింది
చమ్మక్ చంద్ర (Chammak Chandra)


త్రివిక్రమ్ సినిమాల్లో ఈయన కచ్చితంగా ఉంటాడు. దాంతో పాటు మరికొందరు దర్శకులు కూడా చంద్రను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. అలా సినిమాలు.. షోలు పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు చంద్ర. అలాగే ఆస్తులు కూడా సంపాదించుకుంటున్నాడు. మరోవైపు ఈయన ఎందుకు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడు అనేది కూడా ఈ మధ్యే చెప్పాడు చంద్ర. మల్లెమాలతో వివాదాల కారణంగానే ఆయన బయటికి వచ్చేసాడని కొందరు చెబుతున్నా కూడా అందులో నిజం లేదని కన్ఫర్మ్ చేసాడు ఈయన.

Chammak Chandra reveled the reasons behind why he was quit Jabardasth Comedy Show pk జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామజపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో.. jabardasth,jabardasth skits,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
జబర్దస్త్ షో నాగబాబు చమ్మక్ చంద్ర


ముఖ్యంగా తాను నాగబాబు చెప్పడం వల్లే బయటికి వచ్చానని.. ఆయన వచ్చేస్తున్నపుడు మీరు కూడా వస్తే బాగుంటుందని అడిగాడని.. దాంతో ఓ సారి బయటికి కూడా అడుగేస్తే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు చంద్ర. అంతేకానీ మల్లెమాలతో గొడవల్లేవని.. ఇప్పటికీ ఎప్పటికీ అది తనకు లైఫ్ ఇచ్చిన సంస్థే అంటున్నాడు చంద్ర. నితిన్ భరత్ లాంటి కుర్ర దర్శకులను ఎంకరేజ్ చేయాలని.. వాళ్ల కోసం జబర్దస్త్ నుంచి బయటికి రావాలంటూ నాగబాబు కోరడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు ఈయన. మొత్తానికి తాను జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేయడానికి కారణం అయితే ఇతర అంశాలేం లేవు.. సింపుల్‌‌గా నాగబాబు, నితిన్ భరత్ అని తేల్చేసాడు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published: