EX JABARDAST JUDGE ADIRINDI PROGRAMME JUDGE MEGA BROTHER NAGABABU ASSETS AND DEBTS HERE ARE THE DETAILS TA
అదిరింది ప్రోగ్రామ్‌తో అందనంత ఎత్తులో నాగబాబు ఆస్తులు..
నాగబాబు (Nagababu)
నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్ కామెడీ షోతో పాటు అదిరింది వంటి ప్రోగ్రామ్స్‌తో ఎంతోమందికి చేరువయ్యారు.తాజాగా ఈయన
నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్ కామెడీ షోతో పాటు అదిరింది వంటి ప్రోగ్రామ్స్‌తో ఎంతోమందికి చేరువయ్యారు.నటుడిగా నాగబాబు విషయానికొస్తే... చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. లక్ కలిసిరాదు. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి అండదండలతో తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి..మొదటి సినిమాగా ‘రుద్రవీణ’ సినిమాను తెరకెక్కించాడు. కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా.. కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు తెరకెక్కాయి.ఇందులో బావగారు బాగున్నారా మాత్రం కాస్తా పర్వాలేదనిపించింది. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసాయి. ఇంట్లో మెగా హిట్టు ఇచ్చే హీరోలు ఉన్న వారితో హిట్ సినిమాలు నిర్మించలేకపోవడం నాగబాబు దురదృష్టమనే చెప్పాలి.
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్
ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు పాపులారిటీ పెరిగింది. అదే సమయంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో నాగబాబు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. ఐతే.. జబర్ధస్త్ షోలో ఒక్కో షోకు దాదాపు రూ.5 లక్షలు ఛార్జ్ చేసే నాగబాబు.. ఇపుడు జీ తెలుగులో ప్రసారమయ్యే ‘అదరింది’ షోకు మాత్రం అంతకు రెట్టింపుగా పారితోషకం అందుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ అంతగా సక్సెస్ కాలేకపోయినా... నాగబాబు తన ఆస్తులు పెంచుకునే విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇందులో వచ్చిన రెమ్యునరేషన్‌తో నాగబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినట్టు సమాచారం. అక్కడైతే కొన్ని ఒడిదుడుకులు ఎదరైన డబ్బులకు ఎలాంటి ఢోకా ఉండదనే ఉద్యేశ్యంతో అందులో పెట్టినట్టు సమాచారం. ఇక ‘అదిరింది’ ప్రోగ్రామ్ విషయానికొస్తే.. ఇపుడిపుడే కాస్త రేటింగ్స్ వస్తున్నాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆశతోనే ఈ ప్రోగ్రామ్‌ను కంటిన్యూ చేస్తున్నట్టు సమాచారం.
నాగబాబు నిహారిక ఫైల్ ఫోటోస్
సినిమాలు, టీవీ ప్రోగ్రాములు పక్కనపెడితే.. నాగబాబు.. మొన్నటి ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తరుపున ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించాడు. అంతేకాదు నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో నాగబాబు..ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసినపుడు నాగబాబు.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు, తన భార్యకు కలిపి రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చూపించారు. ఇందులో వాహనాలు వంటి చరాస్థులు రూ.36.73 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్థుల విషయానికొస్తే రూ.4.22 కోట్లుగా చూపించారు. దీంతో పాటు రూ.2.70 కోట్ల అప్పు ఉన్నట్లు చూపించారు. మొత్తంగా చూస్తే.. నికరంగా రూ.38 కోట్లు ఆస్తులున్నాయి. అదే మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే.. రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఇక అదిరింది ఇతరత్రా ప్రోగ్రామ్స్‌తో అది ఇపుదు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లకు చేరిందని చెబుతున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.