EX HEROINE MANDYA MP SUMALATHA TEST CORONA NEGATIVE AFTER LONG TREATMENT TA
కరోనాను జయించిన సీనియర్ హీరోయిన్ ఎంపీ సుమలత అంబరీష్..
సుమలత (Twitter/Photo)
మన దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు.ఇక కరోనా బారిన పడ్డ సుమలత తాజాగా కోలుకున్నారు.
మన దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కరోనా బారిన పడ్డారు. వీళ్లందరి కంటే ముందే ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ఐతే ఒక ఎంపీగా తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించిన సుమలత.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే ఆమెకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. అంతేకాదు తనను కలిసి వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరింది.
సుమలత అంబరీష్ (File/Photo)
తాజాగా కరోనాకు చికిత్స తీసుకుంటున్న సుమలతకు డాక్టర్లు మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆమెకు అందులో నెగిటివ్ అని ఫలితం వచ్చింది. సుమలతకు కరోనా నెగిటివ్ రావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంుటన్నారు. తమ అభిమాన నటి మరియు నాయకురాలు.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే పలువురు చనిపోయిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.