లక్ష్మీపార్వతి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. దివంగత మాజీ ముఖ్యమంత్రి సతీమణిగా ఒకానొక సందర్భంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు. దివంగత ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీ పార్వతి అన్న తెలుగు దేశం పార్టీని స్థాపించినా రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. తర్వాత పరిస్థితులను అనుసరించి సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూనే వచ్చారు. ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి చుట్టూ అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాలను ఆధరాంగా చేసుకుని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీ స్ ఎన్టీఆర్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయాలకే పరిమితమైన లక్ష్మీ పార్వతి ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు లక్ష్మీ పార్వతి సినీ రంగంలోకి అడుగు పెట్టారట. నిర్మాతగానో, దర్శకురాలిగానో కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రాధాకృష్ణ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమాలో ముస్కాన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇందులో లక్ష్మీ పార్వతి ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Lakshmi Parvathi, NTR, Tdp