ప్రధాన మంత్రి సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా  ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ తమ వంతు బాధ్యతగా మన తెలుగు హీరోలు ఎపుడు ముందుంటారు. తాజాగా కరోనాపై పోరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు తన వంతు విరాళాన్ని పీఎం సహాయ నిధికి అందజేసారు.

news18-telugu
Updated: April 6, 2020, 5:42 PM IST
ప్రధాన మంత్రి సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం..
రెబల్ స్టార్ కృష్ణంరాజు (Twitter/Photo)
  • Share this:
రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా  ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ తమ వంతు బాధ్యతగా మన తెలుగు హీరోలు ఎపుడు ముందుంటారు. తాజాగా కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచమే స్థంభించిపోయింది. ఈ వైరస్ కట్డడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది పేదవాళ్లతో పాటు సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. అంతేకాదు కరోనా మహామ్మారిని తరిమి కొట్టడంలో భాగంగా ప్రధానమంత్రి  పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు ఓసారి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం తెలిపారు. తాజాగా నిన్నటి నిన్న దేశ ప్రజలందరు బీదా, గొప్పా అనే తేడా లేకుండా అందరు దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. మరోవైపు కరోనా పై పోరులో సినీ నటులు కూడా దేశానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.ఇప్పటికే లా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ డ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. తాజాగా సీనియర్ టాప్ హీరో మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు  రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి సహాయ నిధికి  రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.

rebel star krishnam raju and his wife and 3 daughter donates 10 lakh rupees to pm relief fund,krishnam raju,krishnam raju family,krishnam raju donates 10 lakh rupees to pm relief fund,prabhas,prabhas krishnam raju,prabhas donates 3 crore rupees to pm relief fund,krishnam raju family,krishnam raju wife shyamala,krishnam raju daughters sai praseeda sai prakeerthy sai pradeepthi,krishnam raju family donates 10 lakh rupees to pm relief fund,tollywood,telugu cinema,కృష్ణంరాజు,రెబల్ స్టార్ కృష్ణంరాజు,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,ప్రభాస్ కృష్ణంరాజు,ప్రభాస్ విరాళం,కృష్ణంరాజు,కృష్ణంరాజు భార్య శ్యామల,కృష్ణంరాజు కూతుళ్లు సాయి ప్రదీప్తి సాయి ప్రకీర్తి సాయి ప్రసీద,ప్రధాన మంత్రి సహాయనిధికి కృష్ణంరాజు కుటుంబం విరాళం
కృష్ణంరాజు భార్య శ్యామల ముగ్గురు కుమార్తెలు (Twitter/Photo)

ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ..కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు , పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలుఅందజేస్తున్నారు. మా కుటుంబం నుండి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండవ అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా  రూ. రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు వచ్చారు.

rebel star krishnam raju and his wife and 3 daughter donates 10 lakh rupees to pm relief fund,krishnam raju,krishnam raju family,krishnam raju donates 10 lakh rupees to pm relief fund,prabhas,prabhas krishnam raju,prabhas donates 3 crore rupees to pm relief fund,krishnam raju family,krishnam raju wife shyamala,krishnam raju daughters sai praseeda sai prakeerthy sai pradeepthi,krishnam raju family donates 10 lakh rupees to pm relief fund,tollywood,telugu cinema,కృష్ణంరాజు,రెబల్ స్టార్ కృష్ణంరాజు,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,ప్రభాస్ కృష్ణంరాజు,ప్రభాస్ విరాళం,కృష్ణంరాజు,కృష్ణంరాజు భార్య శ్యామల,కృష్ణంరాజు కూతుళ్లు సాయి ప్రదీప్తి సాయి ప్రకీర్తి సాయి ప్రసీద,ప్రధాన మంత్రి సహాయనిధికి కృష్ణంరాజు కుటుంబం విరాళం
కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి (Twitter/Photo)

అలాగే నా శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని చెప్పింది. కాబట్టి మొత్తం రూ. 10 లక్షల విరాళాన్ని ఈరోజుప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది. కేవలం ఆర్థిక సహకారమే కాకుండా ఈ కరోనా విపత్తును అధిగమించడానికి
మన ప్రియతమ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ విజయానికి సంకేతంగా చప్పట్లు కొట్టడం, నిన్న ఏప్రిల్ 5న కొవ్వొత్తులు వెలిగించి మద్దతు ప్రకటించడం వంటి విషయాలలో కూడా ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరుకుంటున్నాను. మా కుటుంబం మొత్తం ఈ పోరాటంలో పాల్గొంటున్న నందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉందన్నారు. ఇప్పటికే కరోనాపై పోరులో భాగంగా కృష్ణంరాజు తమ్ముడు కొడుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 3 కోట్ల విరాళంతో పాటు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షల వంతున రూ.కోటి.. మరో వైపు సినీ కార్మికుల కోసం ఉద్దేశించిన కరోనా క్రైసిస్ చారిటీ కోసం రూ. 50 లక్షలు విరాళం అందజేసిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా ప్రభాస్.. రూ. 4 కోట్ల 50 లక్షల విరాళం ప్రకటించారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోల్లో అత్యధిక విరాళం ఇచ్చిన కథానాయకుడిగా నిలిచి రియల్ బాహుబలి అనిపించుకున్నాడు.
First published: April 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading