Home /News /movies /

EX CBFC CHAIRPERSON PAHLAJ NIHALANI TO DIRECT MULTI LINGUAL FILM AYODHYA KI KATHA TA

అయోధ్య రామ మందిరంపై బాలీవుడ్‌లో భారీ చిత్రం.. హీరో, దర్శకుడు ఎవరంటే..

’అయోధ్యకీ కథ’పేరుతో ప్యాన్ ఇండియా మూవీ (Twitter/Photo)

’అయోధ్యకీ కథ’పేరుతో ప్యాన్ ఇండియా మూవీ (Twitter/Photo)

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురైనట్టు.. ఎన్నాళ్లుగానో కోట్లాది భారతీయులు ఎదురు చూసిన అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భూమిపూజకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ‘అయోధ్య కీ కథ’ పేరుతో ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు.

ఇంకా చదవండి ...
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురైనట్టు.. ఎన్నాళ్లుగానో కోట్లాది భారతీయులు ఎదురు చూసిన అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భూమిపూజకు శంకుస్థాపన చేశారు. మర్యాద పురుషోత్తముడు రాముడు పుట్టిన అయోధ్య రామ జన్మభూమి శంకుస్థానప కార్యక్రమానికి కోవిడ్ నేపథ్యంలో కొద్ది మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది భారతీయులు ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా  వీక్షించడం జరిగింది.ఇక అయోధ్య రామ మందిరం కోసం దాదాపు 5 వందల ఏళ్లుగా పోరాటం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణంపై ప్రముఖ దర్శక,నిర్మాత పంకజ్ నిహ్లాని ‘అయోధ్యకీ కథ’ పేరుతో ఓ సినిమాను నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే నవంబర్‌లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నట్టు ప్రకటించారు.

అయోధ్య కీ కథ’ పేరుతో బాలీవుడ్‌లో సినిమా (Twitter/Photo)


ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారనేది మాత్రం ప్రకటించలేదు. ఈ విషయాన్ని బాలీవుడ్‌కు చెందిన ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్‌లో ఒకరైన కోమల్ నహతా ట్విట్టర్‌లో ప్రకటించారు. అంతేకాదు శ్రీరామ చంద్రుడి యానిమేటేడ్ ఫోటోతో కూడిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ఈ చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు.


అయోధ్య కీ కథ అంటే ఈ సినిమాను 1528 నుంచి  1992 వరకు అయోథ్య జరిగిన సంఘటన నేపథ్యంలో తెరకెక్కిస్తారా. ఆపై కోర్డు తీర్పు.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి తొలిగిన అడ్డంకులను ఈ సినిమాలో ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక పహ్లాజ్ నిహ్లాని గతంలో విజయ్ మాల్యా జీవితంపై  గోవిందా హీరోగా ’రంగీలా రాజా’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Ayodhya Ram Mandir, Bolllywood, Pahlaj nihalani

తదుపరి వార్తలు