ముద్దుల మావయ్యకు ముద్దుల మేనల్లుడు బర్త్ డే విషెష్.. అది కూడా..

ముద్దుల మావయ్య బాలయ్యకు ఆయన ముద్దుల మేనల్లుడు అదేనండి లోకేష్ బాబు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. అంతేకాదు స్వయంగా మావయ్య బాలకృష్ణ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసాడు.

news18-telugu
Updated: June 10, 2019, 6:24 PM IST
ముద్దుల మావయ్యకు ముద్దుల మేనల్లుడు బర్త్ డే విషెష్.. అది కూడా..
ముద్దుల మావయ్య బాలయ్యకు ముద్దుల మేనల్లుడు బర్త్ డే విషెస్
  • Share this:
ముద్దుల మావయ్య బాలయ్యకు ఆయన ముద్దుల మేనల్లుడు అదేనండి లోకేష్ బాబు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. అంతేకాదు స్వయంగా మావయ్య బాలకృష్ణ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసాడు. తన నట చతురతో కోట్లాది ప్రజల అభిమానం సంపాదించిన కళాకారుడిగా, నిరంతరం ప్రజా సంక్షేమమే పరమావధిగా, ప్రజల కోసం పనిచేస్తున్న బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. అంతేకాదు నటనలో సింహం.. నడతలో లెజెండ్.. వన్నె తగ్గని నటుడు.. భోళా శంకరుడు.. లక్షలాది ప్రాణాలు నిలిపే క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్న అందిరివాడైనా బాలకృష్ణ.. నాకు మాత్రం బాలా మామయ్యే అంటూ రెండో ట్వీట్ చేస్తూ బాలయ్యకు స్వీట్ తినిపిస్తోన్న ఫోటోను పోస్ట్ చేసాడు.

అంతేకాదు పేరులోని బాలకృష్ణుడిలా నవ్వుతూ.. నవ్వితూ..ప్రేమిస్తూ.. ప్రేమ పంచుతూనే ఉండాలి. బాలా మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మూడు ట్విట్లు పెట్టడం చూసి బాలయ్య అభిమానులతో పాటు టీడీపీ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...