ప్లీజ్ ఆ ఒక్క పనిచేయకండి...రెజీనా, అడివి శేష్ విజ్ఞప్తి

news18-telugu
Updated: August 15, 2019, 11:01 PM IST
ప్లీజ్ ఆ ఒక్క పనిచేయకండి...రెజీనా, అడివి శేష్ విజ్ఞప్తి
అడివి శేష్ ‘ఎవరు’ మూవీ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఇండిపెండెన్స్ డే రోజు విడుదలైన 'ఎవరు' మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. అడివి శేష్, నవీన్ చంద్ర, రెజీనా కాసాండ్ర ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సస్సెన్స్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఎవరు' మూవీ యూనిట్ సినీ ప్రేక్షులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. సినిమాల్లో హాల్లో కొందరు వ్యక్తులు మూవీ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి లీక్ చేస్తున్నారని...అలాంటి పనులు చేయకండని ఆడియెన్స్‌ని కోరారు. సినిమాలోని ప్రతి సీన్‌ను థియేటర్ చూస్తేనే మంచి అనుభూతి కలుగుతుందని చెప్పారు. దయచేసి ట్విస్ట్‌లను రివీల్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు నటీనటులు.

క్లైమాక్స్, ఇంటర్వెల్‌లో ఉన్న ట్విస్టులను కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దయచేసి అలాంటి పనులు చేయకండి. మీరు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లోకి వెళ్లి ఆ సౌండ్‌లో చూస్తే ఇంకా థ్రిల్‌గా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు వీడియో రికార్డ్ చేయొద్దు ప్లీజ్.
మూవీ టీమ్
First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>