Evaru Meelo Koteeswarulu Jr NTR - Ram Charan: ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమిని టీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో ఈ ఆదివారం ఎంటో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ గెస్ట్‌గా హాట్ సీటులో కూర్చొని ఎన్టీఆర్ ఇచ్చిన ప్రశ్నలకు ఎంతో చాకచక్యంగా సమాధానిచ్చారు. ఫష్ట్ ఎసిపోడ్ 84,000 ప్రశ్న దగ్గర ఎండ్ అయింది. సోమవారం 1.60,000 ప్రశ్నతో ప్రారంభమైంది. ఓ ప్రశ్నకు సమాధానం కోసం రామ్ చరణ్.. ఫోన్ ఏ ఫ్రెండ్ లైఫ్ లైన్ ద్వారా రానాను లైన్‌లో తీసుకున్నారు. ఐతే.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా మధ్య ఫోన్‌లో ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇంతకీ రామ్ చరణ్.. రానాకు ఫోన్ చేసిన ఆ ప్రశ్న ఏదంటే..
11. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మునిగిపోయిన జలాంతర్గామి పి.ఎన్.ఎస్. ఘాజీ అసలు పేరేంటి ? అనే ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు.
A) చెరోకి B) హెర్క్యలీస్ C) ఫోర్డ్ D) డియాబ్లో
దీనికి రానా ఆప్షన్ D) డియాబ్లో అంటూ సమాధానం చెప్పడం..అదే రామ్ చరణ్ చెప్పడం ఎన్టీఆర్ లాక్ చేసి కరెక్ట్ అని చెప్పడంతో ఎంతో ఆసక్తికరంగా సాగింది.
మరోవైపు ఈ ఎపిసోడ్‌లో పలు ప్రశ్నలు ఆసక్తికరంగా సాగాయి.
9.జూన్ 2020లో భారత్, చైనా మధ్య వివాదం తలెత్తిన గల్వాన్ లోయ ఏ ప్రాంతంలో ఉంది.
A) లద్దాఖ్ B) హిమాచల్ ప్రదేశ్ C) రాజస్థాన్ D) అరుణాచల్ ప్రదేశ్
అనే దానికి ఆప్షన్ A ) లద్దాఖ్ చెప్పారు రామ్ చరణ్..
10.లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించిన మొట్ట మొదటి భారతీయ చిత్రం ఏది ? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు.
A) బాహుబలి: ది బిగినింగ్ B) దంగల్ C) 2.0 D) కె.జి.యఫ్: ఛాప్టర్ 1
దీనికి రామ్ చరణ్ ఆప్షన్ A) బాహుబలి : ది బిగినింగ్ అని సమాధానం ఇచ్చారు.
దీంతో పాటు పలు ఎన్టీఆర్ అడిగిన పలు ప్రశ్నలు ఆసక్తి రేకిత్తాయించాయి.
ఏ పాలకుడి దగ్గర బ్యూసీఫాలస్ అనే యుద్ధాశ్వశం ఉండేది
A) అశోక ది గ్రేట్ B) అక్బర్ ది గ్రేట్ C)అలెగ్జాండర్ ది గ్రేట్ D) ఆల్ఫ్రెడ్ ది గ్రేట్
అనే ప్రశ్నకు 50 50 లైఫ్ లైన్ యూజ్ చేసుకొని
ఆప్షన్ C) అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధానం చెప్పి 25,000,00 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.
దీంతో ఈ షో కర్టెన్ రైజర్ ముగిసింది. ఈ షోలో గెలుచుకున్న రూ. 25,00,000 రామ్ చరణ్.. తన తండ్రి స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు అందజేయనున్నట్టు చరణ్.. ఎన్టీఆర్‌కు తెలిపారు. మొత్తంగా భారీ స్థాయిలో లాంఛ్ చేసిన ఈ ప్రోగ్రామ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి..
Mahesh Babu - Prabhas : ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానంటున్న మహేష్ బాబు భామ..
Chiranjeevi: చిరంజీవి తన సినీ కెరీర్‌లో రిజెక్ట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా..
Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Evaru Meelo Koteeswarulu, Jr ntr, Ram Charan, Rana daggubati, Tollywood