Evaru Meelo Koteeswarulu Jr NTR - Ram Charan: ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమిని టీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో ఈ ఆదివారం ఎంటో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభ ఎపిసోడ్‌లో హైలెట్‌గా రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చిన హాట్ సీటులో కూర్చున్నారు. ఆర్ఆర్ ఆర్ హీరోలు ఇద్దరూ రావడంతో ఫస్ట్ ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు బాగా వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్, కళ్యాణ్ కృష్ణ కురసాల లాంటి దర్శకులు వీటిని తెరకెక్కించారు.నిజానికి మార్చిలోనే షోకి సంబంధించి ఎంట్రీస్ తీసుకున్నారు కానీ కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సీజన్ కోసం దాదాపు 13 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎంటర్‌టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేసారు.
ఈ సందర్భంగా హోస్ట్‌గా ఎన్టీఆర్ అడిగిన పలు ప్రశ్నలకు రామ్ చరణ్ అంతే ఆసక్తిగా సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. రామ్ చరణ్‌కు సంబంధించిన పర్సనలు విషయాలను కూడా అడిగారు. ఈ సందర్భంగా తన దగ్గర 6 కుక్కులున్నాయి. మరోవైపు గుర్రాలను పెంచుకోవడం అంటే ఎంతో సరదా అన్నారు. అంతేకాదు తన దగ్గర ఉన్న గుర్రాలలో ఒక దాని ‘బాద్‌షా’ అని చెప్పారు. ‘మగధీర’లో నేను రైడ్ చేసిన గుర్రం అదే అని చెప్పారు. మరోవైపు ఓ స్నేహితుడు అతను చనిపోయే ముందు తనకు మరో గుర్రాన్ని ఇచ్చాడు. దానికి కాజల్ అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చారు. మగధీర రిలీజయ్యాక అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందంటూ నవ్వులు పూయించారు రామ్ చరణ్.
ఈ సందర్భంగా బాబాయి పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్. ఇక తను ఎపుడు బోర్ ఫీలైనపుడల్లా ‘అదుర్స్’ సినిమా చూసి రిలాక్స్ అవుతూ ఉంటాను. అందులో నీ కామెడీ టైమింగ్, పంచ్‌లు నిజంగా అదుర్స్ అంటూ ఎన్టీఆర్ యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు రామ్ చరణ్.
మరోవైపు ... మేమందరం ఆచార్య సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నాం అంటూ తారక్ అడిగిన ప్రశ్నకు.. రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాన్న చిరంజీవితో పూర్తి స్థాయిలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో నటించేటపుడు స్కూల్లో ప్రిన్స్‌పల్‌తో ఎలా ఉంటానో అలాగా ప్రవర్తించాను. నీ, నా డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను మంచి ఎమోషన్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా మా కుటుంబానికి స్పెషల్ అని చెప్పారు.
మరోవైపు రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’లో కొమరం భీమ పాత్ర హైలెట్. స్క్రీన్ పై తారక్ ను చూసి అందరు ఫిదా అవుతారు. రిలీజయ్యాక మీరే మాట్లాడుకుంటారు అని ఆర్ఆర్ఆర్ పై ఆసక్తికరంగా మాట్లాడారు చరణ్. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. ‘కొమరం భీమ్’ పాత్రలో నటించడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. అల్లూరి సీతారామరాజుగా నువ్వు.. కొమరం భీమ్‌గా నేను ఎంత కష్టపడ్డామో తెలుసుగా.. అలాంటి గొప్ప యోధుల పాత్రల్లో నటించడం మా జన్మ ధన్యమైంది అంటూ తారక్ ఒకింత ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..
Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.