NTR - Evaru meelo Koteeswarudu: ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రారంభం.. ఎప్పుడంటే?

NTR, Evaru meelo Koteeswarudu

NTR - Evaru meelo Koteeswarudu: బుల్లితెరలో త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో గురించి ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక

  • Share this:
    NTR - Evaru meelo Koteeswarudu: బుల్లితెరలో త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో గురించి ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్నాడు. ఈ షోకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల కాగా కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక వాటికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలవుతున్నాయి. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ షో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇది వరకే ఈ షో రెండు సీజన్ లను పూర్తి చేసుకుంది. ఇక గతంలో ఈ షో లను స్టార్ మాలో ప్రసారం చేయగా.. ఈసారి ఈ సీజన్ జెమినీ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్ననాడు. ఇక టైటిల్ లో కూడా కొన్ని మార్పులు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పలు సినిమాలలో బిజీగా ఉండగా అందులో కాస్త బ్రేక్ రావడంతో ఈ రియాల్టీ షోకు తన పనులు చకచకా పూర్తి చేసుకుంటున్నాడు.

    ఇక ప్రస్తుతం కొన్ని ఆఫ్ లైన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల కోసం ఆడిషన్స్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ షో ఆగస్టు 22న ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జెమిని ఛానల్ లో ప్రసారం కానుంది.

    ఇక దీంతో ఒక స్పెషల్ ప్రోమో కూడా విడుదలయింది. అందులో ఎన్టీఆర్.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా అంటూ తెలియజేశాడు. ఆగస్టు 22న కర్టెన్ రైజర్ ఆ మరుసటి రోజు 23న షో టెలికాస్ట్ చేయనున్నారు. మొత్తానికి ఈ షో కోసం ఎదురుచూస్తున్నా బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
    Published by:Navya Reddy
    First published: