Home /News /movies /

Sridevi Drama Company: అదిరిపోయే కామెడీతో అదరగొడుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ.. నవ్వులే నవ్వులు!

Sridevi Drama Company: అదిరిపోయే కామెడీతో అదరగొడుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ.. నవ్వులే నవ్వులు!

Sridevi Drama Company

Sridevi Drama Company

Sridevi Drama Company: బుల్లితెరలో ఎన్నో కామెడీ, ఎంటర్ టైన్ మెంట్, రీయాలిటి వంటి పలు షో లు ప్రసారమవుతున్నాయి. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరు తమ పర్ఫార్మెన్స్ తో బాగా అదరగొడుతున్నారు.

    Sridevi Drama Company: బుల్లితెరలో ఎన్నో కామెడీ, ఎంటర్ టైన్ మెంట్, రీయాలిటి వంటి పలు షో లు ప్రసారమవుతున్నాయి. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరు తమ పర్ఫార్మెన్స్ తో బాగా అదరగొడుతున్నారు. తమ స్కిట్ లతో మంచి పేరు అందుకొని వెండితెర సెలబ్రిటీగా మారుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది బుల్లి తెర నుండి వెండితెరపై అడుగులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మరో బుల్లితెర షో తమ పర్ఫార్మెన్స్ తో తెగ అదరగొడుతున్నారు.

    ఈటీవీలో ప్రసారమవుతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో అన్ని రకాల వినోదాన్ని అందిస్తున్నారు. రేటింగ్ విషయం లో కూడా ఈ షో మొదటి స్థానంలో ఉంది. ఇందులో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తూ తన మాటలతో బాగా నవ్విస్తాడు. ఈ ఏడాది ప్రారంభమైన ఈ షో మరో జబర్దస్త్ లా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ షో ప్రోమో విడుదలయ్యింది.

    https://youtu.be/y2QfwdT_hqs

    అందులో సుడిగాలి సుధీర్ తన డైలాగులతో కామెడీ పంచితే తనతో పాటు ఉన్న మరో కమెడియన్స్ నూకరాజు, ఇమ్మాన్యుయేల్ తెగ పంచులు విసురుతున్నారు. అంతేకాకుండా ముఖ్య అతిథిగా ప్రముఖ హాస్యనటుడు బాబు మోహన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కూడా ఎంట్రీ పర్ఫామెన్స్ తో బాగా నవ్వించాడు. ఇక ఇందులో డాన్సర్లు డాన్స్ స్టెప్పులతో బాగా సందడి చేశారు. ఇక ఇందులో సింగర్ గీతామాధురి తన పాటతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక చివర్ లో నిపుణుల పర్యవేక్షణలో కొన్ని విన్యాసాలు చేయగా ప్రేక్షకులు తో సహా అందులో పాల్గొన్న వాళ్లు అంతా షాక్ అయ్యారు. మొత్తానికి ఈ షో మొత్తం బాగా నవ్వులు పండించగా దీనికి సంబంధించిన ఎపిసోడ్ జూన్ 6న ప్రసారం కానుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Latest promo, Social Media, Sreemukhi, Sridevi Drama Company, Sridevi Drama Company Latest Promo, Sridevi Drama Company Promo, Sudigali sudheer, Telugu tv shows, Vakeel saab poster, Viral, శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీముఖి, సుడిగాలి సుధీర్

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు