Kewal Tamang - Yash Master: ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో గురించి అందులో పర్ఫామెన్స్ చేసే కంటెస్టెంట్ ల గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది డాన్సర్ లు ఈ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొందరు డాన్సర్ లు కొరియోగ్రాఫర్ గా కూడా సెటిల్ అయ్యారు. ఇక ఈ షో ద్వారా కొరియోగ్రాఫర్ గా నిలిచిన యశ్వంత్ మాస్టర్ గురించి అందరికీ తెలుసు. మంచి పేరు సంపాదించుకొని వెండితెరపై కూడా తనేంటో నిరూపించుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు. ఇదిలా ఉంటే మరో కంటెస్టెంట్ మృతి కావడంతో బాగా ఎమోషనల్ అయ్యాడు యష్ మాస్టర్.
ఢీ షో లోనే మరో కంటెస్టెంట్ కేవల్ అన్న డాన్సర్ తన డాన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన గత కొంత కాలం నుండి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దీంతో యష్ మాస్టర్ అతడిని బతికించుకోవడం కోసం బాగా ప్రయత్నాలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరిని ఆర్థికంగా సహాయం కోరాడు. అతడికి బ్లడ్ అవసరం ఉందని దయచేసి బతికించండి అంటూ కోరాడు.
ఇది కూడా చదవండి:ఆ ఒక్క మాటతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఇండస్ట్రీ డౌట్స్ అన్ని క్లియర్!
దీంతో కొందరు సెలబ్రెటీలు, కొందరు అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన సహాయాన్ని చేశారు. ఇక ఈ షోలో జడ్జిలుగా చేస్తున్నా ప్రియమణి, శేఖర్ మాస్టర్, పూర్ణ కూడా సహాయం చేసి మరి కొంతమందిని సహాయం చేయాలని కోరారు. కానీ కేవల్ బ్రతకలేకపోయాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నా కూడా ఆరోగ్య సమస్య మరింత తీవ్రంగా మారటంతో ఆదివారం రోజు మృతి చెందాడు. దీంతో యష్ మాస్టర్ తో సహా సెలబ్రెటీలు, అభిమానులు ఎమోషనల్ తో అతనికి సంతాపం తెలిపారు.
ఇది కూడా చదవండి:తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో అడవి శేష్.. ఆ వ్యాధితో ఇబ్బంది పడుతూ
యష్ మాస్టర్ మరింత బాధతో కృంగిపోయాడు. తన సోషల్ మీడియా వేదికగా కేవల్ తో హాస్పిటల్ లో దిగిన ఫోటోను పంచుకుంటూ.. నా సోదరుడి మరణాన్ని భరించలేకపోతున్నాను.. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.. ఇప్పటికి నువ్వు ఉన్నట్లుగానే అనిపిస్తుంది.. అందరిని ఒంటరిని చేసి ఎంతో త్వరగా ఈ లోకం నుండి వెళ్ళిపోయావు అంటూ.. ఎమోషనల్ అయ్యాడు యష్ మాస్టర్. ఇక యష్ చేసిన ఎమోషనల్ పోస్ట్ కి నెటిజన్లు కేవల్ కు సంతాపం తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dance Plus, Etv Dhee show, Yash master