విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సమంత(Samantha) జంటగా వస్తున్న ప్రేమకథా చిత్రం ఖుషి(Kushi). శివ నిర్వాణ(Siva Nirvana) దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని పలు అందమైన లొకేషన్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ‘ఖుషి’(Kushi) అనే పేరు ఖరారు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఇప్పుడీ పేరునే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో విజయ్ స్టైలిష్ లుక్‌లో కనిపించగా.... సమంత సంప్రదాయ దుస్తుల్లో చిరకట్టులో అలరించిది. అయితు ఇప్పుడు ఈ పోస్టర్(Kushi Poster) పై పలురకాల విమర్శలు వస్తున్నాయి. పోస్టర్‌ను చూసిన నెటిజన్లు దానిపై రకరకాల విమర్శలు చేస్తున్నారు.
ఒకసారి ఖుషి పోస్టర్(Kushi Poster) గమనిస్తే.. ఈ పోస్టర్ లో పింక్ డామినేషన్ ఎక్కువగా ఉంది అని కొందరు అంటుంటే. మరికొందరు విజయ్ డ్రెస్సింగ్ స్టైల్ వింతగా ఉందని చెబుతున్నారు. అలాగే ఇంకొంత మంది అయితే ఇందులో ఒక తప్పును కూడా కనిపెట్టారు.ఈ పోస్టర్ లో విజయ్ సిగెరెట్ తాగుతూ కనిపించాడు. అయితే విజయ్ నోట్లో ఉన్న సిగరేట్ పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఇది ఈ సినిమా ఎడిటింగ్ లో పెట్టింది అని ఇట్టే తెలిసి పోతుంది. ఈ పోస్టర్ ను జూమ్ చేసి చుస్తే ఈ ఫోటోలో తర్వాత సిగెరెట్ ను యాడ్ చేసారు అని స్పష్టంగా తెలియడంతో ఏం ఎడిటర్ వయ్యా నువ్వు... అమీర్ పేట్ ఎడిటింగ్ నా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
మరోవైపు ఇదే పోస్టర్ పై మరో రకమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. విజయ్ దేవరొకండ పేరుకు ముంది ది అని పెట్టడంపై కూడా విమర్శలు చేస్తున్నారు. పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు కు ముందు ‘The’పెట్టడమే అనేకమంది నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ని ఈ ‘The’ అని పెట్టడం సూచిస్తోంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. విజయ్ కెరీర్ లో ఈ సినిమా 11వ సినిమాగా తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. మహానటి తర్వాత సామ్, విజయ్ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Samantha Ruth Prabhu, Vijay Devarakonda