హోమ్ /వార్తలు /సినిమా /

Ester Noronha: ఓటీటీలో ఐరావతం హవా.. పార్ట్ -2కి నాంది పలికిన డిమాండ్

Ester Noronha: ఓటీటీలో ఐరావతం హవా.. పార్ట్ -2కి నాంది పలికిన డిమాండ్

Iravatham (Photo News 18)

Iravatham (Photo News 18)

Ester Noronha Iravatham: ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన ఐరావతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఊహించని ఆదరణ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాకు పార్ట్ -2 రూపొందిస్తున్నట్లు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఒక చిన్న సినిమా ఊహించని ప్రజాదరణ దక్కించుకుని 200 మిలియ‌న్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ మినిట్స్ తో హాట్ స్టార్ తెలుగులో ఇంకా ఆదరణలో ఉంది. ఆ చిత్రమే "ఐరావతం" (Iravatham). ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన ఐరావతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఊహించని ఆదరణ దక్కించుకుంది. ఇప్పటివరకు 200 మిలియన్స్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూయింగ్ మినిట్స్ దక్కించుకుని ప్రేక్షకుల ఆదరణ లోనే ఉంది.

ఇండియా లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి రీసెంట్ గా వచ్చి సైలెంట్ గా హిట్ కొట్టింది "ఐరావతం". ఈ డీసెంట్ ఫ్యూజన్ డ్రామా నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. శ్లోక అనే బ్యూటీషియన్ కి బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్ గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులు అవుతుంది. బర్త్ డే వీడియో లు తీస్తే డెత్ డే వీడియో లు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయట పడుతుంటాయి. ఆ రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథా గమనంలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది.

క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు త‌న ప్రేమికుడితో వెళ్లిపోతుంది. తీరా ఆ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా. గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ మూవీ ని స్టోరీ మూడ్ ఫ్లో కి అనుగుణంగా చిత్రీకరించారు. నూజివీడు టాకీస్ పై రేఖ పలగని సమర్పణ లో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాత లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

న్యూ యేజ్ థ్రిల్లర్ "ఐరావతం" విశేష‌మైన ఆడియెన్స్ ఆద‌ర‌ణ పొందుతూ ఇప్పటికీ 200 మిలియన్ అండ్ ఫిఫ్టీ తౌసండ్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. దీనికి వ‌స్తోన్న హ్యూజ్ రెస్పాన్స్‌తో టీమ్ అంతా క‌ల‌సి సక్సెస్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను స్టార్ట్ చేశారు. త్వరలోనే రాబోయే ఈ సీక్వెల్ కూడా ఇంతే ఆదరణను దక్కించుకుంటుందా? లేదా? అనేది చూడాలి మరి.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు