అలా నన్ను చూస్తే ఖచ్చితంగా తిట్టుకుంటారు : జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్

Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్‌.. తెలుగు తెరకు 'జెర్సీ' సినిమా ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. తాజాగా ఈ భామ 'నేర్కొండ పార్వాయ్' అనే తమిళ సినిమాలో నటించింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సినిమాలో తన పాత్ర గూర్చి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

news18-telugu
Updated: August 3, 2019, 11:56 AM IST
అలా నన్ను చూస్తే ఖచ్చితంగా తిట్టుకుంటారు : జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్
Photo : instagram.com/shraddhasrinath
news18-telugu
Updated: August 3, 2019, 11:56 AM IST
Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్‌.. తెలుగు తెరకు 'జెర్సీ' సినిమా ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. శ్రద్ధా తెలుగులోనే కాకుంండా అటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది. అందంతో పాటు.. అభినయంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ. ‘జెర్సీ’ సినిమాతో కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్ అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈమెకు మొదటి సినిమానే మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. గ్లామర్, రొమాన్స్ తో పాటు ఒక సగటు ఇల్లాలు వంటి ఏ పాత్రలోనైనా తాను ఒదిగిపోగలనని కేవలం ఈ ఒక్క సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది శ్రద్ధా శ్రీనాథ్‌. తాజాగా ఈ భామ 'నేర్కొండ పార్వాయ్' అనే తమిళ సినిమాలో నటించింది. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి పాత్రలో నటించింది శ్రద్ధా శ్రీనాథ్‌. ఈ సినిమా హిందీలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. 



 




Loading...

View this post on Instagram




 

@kalyanyasaswi x @chitramaudgil x @kammarishivarajchary


A post shared by Shraddha Srinath (@shraddhasrinath) on





 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘ నా కెరీర్‌లో మరిచిపోలేని సినిమా నేర్కొండ పార్వాయ్' అని.. ఈ చిత్రంలో నటించాలని.. నాకు కొన్ని నెలల క్రితం ఫోన్‌ వచ్చింది. ఆ తర్వాత ఎటువంటి స్పందన లేదు.. దీంతో అసలు నేను ఈ సినిమాలో నటిస్తున్నానా.. లేదా? అనే సందేహం వస్తుండేది. అయితే కొంత కాలం తర్వాత దర్శకుడు వినోద్‌ ఫోన్ చేయడంతో.. హుషారుగా వెళ్లి నటించానని తెలిపింది. శ్రద్ధా మాట్లాడుతూ.. అజిత్‌తో కలిసి నటించాలన్నదే నా కల. ఆ కోరిక ఈ 'నేర్కొండ పార్వాయ్' సినిమాతో  నెరవేరిందని..చెప్పుకోచ్చింది. అయితే ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు.. మీ పాత్రను చూసి ప్రేక్షకులు మిమ్మల్ని అసహ్యించుకోవాలి.. మీరంటేనే వారికి కోపం రావాలని దర్శకుడు వినోద్‌ చెప్పారని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే నటించానని.. ఈ  సినిమా చూస్తే నిజంగానే ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటారని.. అలా నా పాత్ర ఉంటుందని పేర్కోంది శ్రద్ధా.
First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...