Enugu Movie Review : ఏనుగు మూవీ రివ్యూ.. డైరెక్టర్ మార్క్ యాక్షన్ డ్రామా..
ఏనుగు మూవీ రివ్యూ (Twitter/Photo)
Enugu Movie Review : అరుణ్ విజయ్ హీరోగా యాక్షన్ సినిమాల దర్శకుడు హరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఏనుగు’. ముఖ్యంగా టైటిల్‌తోనే ఈ సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయింది. మరి అంచనాలను ఏనుగు సినిమా అందుకుందా లేదా చూద్దాం..
అరుణ్ విజయ్ హీరోగా యాక్షన్ సినిమాల దర్శకుడు హరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఏనుగు’. ముఖ్యంగా టైటిల్‌తోనే ఈ సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయింది. మరి అంచనాలను ఏనుగు సినిమా అందుకుందా లేదా చూద్దాం..
కథ విషయానికొస్తే..
ఏనుగు మూవీ కథ విషయానికొస్తే.. కాకినాడ ప్రాంతంలో సముద్రం, పీవీఆర్ అనే రెండు వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా శతృత్వం ఉంటుంది. పీవీఆర్ కుటుంబంలో రవి (అరుణ్ విజయ్)కు ఆయన సవతి తల్లి కుమారులు (సముద్రఖని, సంజీవ్, బోస్ వెంకట్) అండగా ఉంటారు. ఈ ఫ్యామిలీకి సముద్రం ఫ్యామిలీకి చెందిన లింగం (కేజీఎఫ్ గరుడ రామ్) తో వైరం ఉంటుంది. ఈ క్రమంలో హీరో అన్న కూతురు వేరే మతానికి చెందిన యువకుడితో లేచిపోతుంది. ఈ నేపథ్యంలో హీరో రవి మరో మతానికి చెందిన యువతితో ప్రేమలో పడతాడు. ప్రేమించిన యువకుడితో అన్న కూతురు లేచిపోవడం వల్ల హీరో కుటుంబం ఎలాంటి సమస్యలను ఫేస్ చేసింది. ఈ నేపథ్యంలో హీరోకి అతనికి అన్నల మధ్య వైరం ఏర్పడుతోంది. చివరకు హీరో తన కుటుంబంతో పాటు ప్రత్యర్థి ఫ్యామిలీలలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడనేది ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే..
దర్శకుడు హరి తాను ఏదైతే కథ అనుకున్నాడో అదే విధంగా తెరపై చక్కగా ఆవిష్కరించాడు. రొటీన్ కథనే దర్శకుడు హరి తన మార్క్ ఫాస్ట్ యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్లే ఈ సినిమాను పరిగెత్తించాడు. ప్రీ క్లైమాక్స్, క్టైమాక్స్ను అద్భుతంగా తెరకెక్కించాడు.సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, సముద్ర తీరం అందాలను చక్కగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా సినిమాలో బోట్ ఛేజింగ్ ఫైట్ మాస్ ఆడియన్స్‌కు కిక్ అందిస్తాయి. ఈ సినిమాకు జీవి ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులకు అక్కడక్కడ బోర్ కొట్టిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెబితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
హీరో అరుణ్ విజయ్ .. తెలుగులో బ్రూస్లీ, సాహో తో పాటు పలు డబ్బింగ్ చిత్రాలతో పలకరించాడు. తాజాగా ఏనుగు మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక సామాన్య మధ్యతరగతి యువకుడి పాత్రలో అలరించాడు. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. క్రిష్టియన్ యువతి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. హీరో పాత్ర తర్వాత సముద్రఖని తన నటనతో ఇరగదీసాడు. ఇలాంటి పాత్రలు సముద్రఖని పర్ఫెక్ట్గా సరిపోతాడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు ఈయన క్యారెక్టర్ సినిమాకు బ్యాక్ బోన్. మిగతా పాత్రల్లో నటించిన రాధిక శరత్ కుమార్, గరుడ రామ్ నటన బాగుంది. ఇక యోగిబాబు ఈ సినిమా చూసేవాళ్లకు పెద్ద రిలీఫ్.
ప్లస్ పాయింట్స్
అరుణ్ విజయ్, సముద్రఖని నటన
డైరెక్షన్స్, స్క్రీన్ ప్లే
యోగిబాబు కామెడీ
మైనస్ పాయింట్స్
రొటిన్ కథ
సినిమా నిడివి
ఎమోషన్స్ సమపాళ్లలో లేకపోవడం
చివరి మాట : ఏనుగు హరి మార్క్ యాక్షన్ డ్రామా..
రేటింగ్ : 2.75/5
Published by:Kiran Kumar Thanjavur
First published:
రేటింగ్
కథ
:
2.5/5
స్క్రీన్ ప్లే
:
3/5
దర్శకత్వం
:
3/5
సంగీతం
:
3/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.