సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో ఎన్ శ్రీనివాసన్ (N Srinivas) ని దర్శకుడిగా పరిచయం చెస్తూ రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఎంతవారు గాని' (Enthavarugani). గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ని హిట్ చిత్రంతో సక్సెస్ అందుకున్న హిట్ హీరో అడవి శేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి అడవి శేష్ (Adavi sesh) ప్రత్యేక అభినందనలు తెలియచేసారు.
కేవలం ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పారు. ‘ఎంతవారుగాని’ సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉంటుందని ఈ వీడియో ద్వారా వెల్లడించారు. యూత్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ టీజర్ చూసిన అడవిశేష్ ఎంతో బాగా వచ్చిందని చెబుతూ చిత్రయూనిట్ ని అభినందించారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
దర్శకుడు శ్రీనివాసన్. ఎన్ ని ‘నివాస్’ అనే పేరుతో తన 'రంగీలా' సినిమాతో ఎడిటర్ గా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత 'క్షణ క్షణం', 'గాయం', 'గోవిందా గోవిందా', 'రాత్రి', 'అంతం', 'ద్రోహి', 'మనీ', 'అనగనగ ఒక రోజు', 'మృగం', 'రాత్', 'మనీ మనీ' సినిమాలకు ఆయన సౌండ్ ఇంజినీర్ గా పని చేసి అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు 'ఎంతవారు గాని' అనే ఈ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించబోతున్నారు శ్రీనివాస్ ఎన్.
ప్రవీణ్ K బంగారి సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. JK మూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఇతర వివరాలు ప్రకటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actor