ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ.. జస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టేనర్..

Entha Manchivadaavuraa | గతేడాది ’118’ తో మంచి హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. మరోవైపు ‘శతమానం భవతి’, వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌తో అలరించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన కుటుంబ కథా చిత్రం  ‘ఎంత మంచివాడవురా. ఇప్పటి వరకు మాస్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్..సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తొలిసారి ఫ్యామిలీ ఎంటర్టేనర్ మూవీ చేసాడు. ఈ మూవీతో కళ్యాణ్ రామ్‌కు సతీష్ వేగేశ్న మంచి హిట్ అందించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. 

news18-telugu
Updated: January 15, 2020, 3:26 PM IST
ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ.. జస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టేనర్..
2. ఎంత మంచివాడవురా: సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలతో పోటీ పడుతూ తన సినిమా ఎంత మంచివాడవురా విడుదల చేసాడు కళ్యాణ్ రామ్. సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది.
  • Share this:
నటీ నటులు: నందమూరి కళ్యాణ్ రామ్,మెహ్రీన్ కౌర్,సుహాసిన,శరత్ బాబు , తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల,వెన్నెల కిషోర్ తదితరులు..

సంగీతం : గోపి సుందర్

దర్శకత్వం: సతీష్ వేగేశ్న

నిర్మాతలు :  ఉమేష్ గుప్త , సుభాష్ గుప్త,శివలెంక కృష్ణప్రసాద్

నిడివి : 2 గం 24 నిమిషాలు

గతేడాది ’118’ తో మంచి హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. మరోవైపు ‘శతమానం భవతి’, వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌తో అలరించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన కుటుంబ కథా చిత్రం  ‘ఎంత మంచివాడవురా. ఇప్పటి వరకు మాస్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్..సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తొలిసారి ఫ్యామిలీ ఎంటర్టేనర్ మూవీ చేసాడు. ఈ మూవీతో కళ్యాణ్ రామ్‌కు సతీష్ వేగేశ్న మంచి హిట్ అందించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే.. పుట్టగానే తల్లి తండ్రులను పోగుట్టుకున్న బాలు (కళ్యాణ్ రామ్)ను చుట్టాలెవరు ఆదరించరు. చివరకు తన తండ్రి స్నేహితుడైన నరేష్ బాలును పెంచి పెద్ద చేస్తాడు. ఐతే.. చిన్పప్పటి నుంచే నరేష్ చిన్నకూతురు నందిని (మెహ్రీన్)ను ఇష్టపడుతుంటాడు. ఇక హీరోయిన్ నందిని షార్ట్ ఫిల్మ్‌లు ప్రొడ్యూస్ చేస్తే వాటిలో బాలు హీరోగా నటిస్తు ఉంటాడు. ఐతే.. ఎవరు లేని అనాథగా పెరిగిన కళ్యాణ్ రామ్.. ఒక బిజినెస్ ప్లాన్ చేస్తాడు. ఆ బిజినెస్‌లో హీరోయిన్ నందిని కూడా పార్టనర్‌గా చేరుతుంది. ఈ బిజినెస్ వల్ల కళ్యాణ్ రామ్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడు. అసలు కళ్యాణ్ రామ్ స్టార్ చేసిన ఆ బిజినెస్ ఏమిటి ? చివరకు హీరో, హీరోయిన్ ప్రేమ సక్సెస్ అయిందా ? లేదా అనేదే ఎంత మంచివాడవురా సినిమా స్టోరీ.

నటీనటుల విషయానికొస్తే.. 

ఇప్పటి వరకు కేవలం మాస్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి ‘ఎంత మంచివాడవురా’ వంటి ఫ్యామిలీ ఎంటర్టేనర్‌లో చక్కగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. నటన, డైలాగ్స్, డాన్స్ పరంగా ఆకట్టుకున్నాడు. మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. సినిమా మొత్తం హీరోతో ట్రావెల్ చేసే పాత్ర. కానీ మెహ్రీన్ కౌర్ ఎమోషనల్ పండించే సన్నివేశాల్లో తేలిపోయింది. చాలా కాలం తర్వాత సుహాసిన, శరత్ బాబు వంటి నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతినాయకుడిగా రాజీవ్ కనకాల ఉండేది కొద్ది సేపే అయినా.. తనదైన యాక్టింగ్‌తో రఫ్పాడించేసాడు. మిగతా పాత్రల్లో నటించిన వెన్నెల కిషోర్, విజయ్ కుమార్, తనికెళ్ల భరణి తమ పాత్రల్లో మెప్పించారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే.. 

‘శతమానం భవతి’ వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌తో అలరించిన సతీష్ వేగేశ్న మరోసారి సకుటుంబ సపరివార సమేత సినిమాగా ‘ఎంత మంచివాడవురా’ సినిమాను తీర్చిదిద్దాడు. చెప్పాలకున్న కథ మంచితే కానీ.. అక్కడక్కడ తడబడ్డాడు. ఈ స్టోరీ ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించినా.. మాస్ ప్రేక్షకులను ఆకట్టకోవడం అనుమానమే గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఫోటోగ్రఫీ బాగుంది. మొత్తానికి ఈ సంక్రాంతికి కుటుంబ కథా చిత్రాలను చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అలరిస్తుంది. 

చివరి మాట: ‘ఎంత మంచివాడవురా’ కొద్ది మందిని మాత్రమే ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టేనర్

ప్లస్ 

కథ

కళ్యాణ్ రామ్ నటన

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ 

కథనం

నిడివి

రేటింగ్ : 2.75/5 
Published by: Kiran Kumar Thanjavur
First published: January 15, 2020, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading