సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రబర్తికి ఈడీ సమన్లు..

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాలతో పాటు సినీ అభిమానులను  నిర్ఘాంత పోయేలా చేసింది.సుశాంత్ మృతి నేపథ్యంలో రియా చక్రబర్తిపై ఉచ్చు బిగుస్తోంది. తాజాగా రియా చక్రబర్తికి ఈడీ సమన్లు జారీ చేసింది.

news18-telugu
Updated: August 5, 2020, 8:37 PM IST
సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రబర్తికి ఈడీ సమన్లు..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తి (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాలతో పాటు సినీ అభిమానులను  నిర్ఘాంత పోయేలా చేసింది. 34 సంవత్సరాల వయసున్న ఈయన బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. ఈయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈయన ఆత్మహత్య నేపథ్యంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తిపై రోజుకో ఉచ్చు బిగుసుకుపోతుంది. ఆమె వల్లే సుశాంత్ కన్నుమూసాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బిహార్ ప్రభుత్వం సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి చేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశించారు. మరోవైపు రియా చక్రబర్తి కనపడటం లేదనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె లాయర్ సతీష్ ఆమె ఎక్కడికి పారిపోలేదన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తుకు అంగీకరించింది.

తాజాగా ఈ కేసులో సీబీఐ.. రియా చక్రబర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ముంబై పోలీసులు ఆమెను పలుమార్లు విచారించారు. ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. తాజాగా సుప్రీంకోర్టు సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ ఎంక్వైరీ జారీ చేయడంతో ఇపుడైనా సుశాంత్ మృతి వెనక ఉన్న అసలు రహస్యలు బయటకు వస్తాయని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 5, 2020, 8:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading