Sushant Case: సుశాంత్ కేసులో రియాకు అదొక్కటే ఊరట.. ఈడీ దర్యాప్తులో కీలక మలుపు..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి చుట్టూ రోజుకో ఉచ్చు బిగుసుకుంటుంది. తాజాగా ఈ కేసులో ఈడీ రియాకు మరో ట్విస్ట్ ఇస్తోంది.

news18-telugu
Updated: August 13, 2020, 7:44 PM IST
Sushant Case: సుశాంత్ కేసులో రియాకు అదొక్కటే ఊరట.. ఈడీ దర్యాప్తులో కీలక మలుపు..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రబర్తి (Twitter/photo)
  • Share this:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి చుట్టూ రోజుకో ఉచ్చు బిగుసుకుంటుంది. ఆమె వల్లే సుశాంత్ చనిపోయాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుశాంత్ మృతి కేసుపై విచారణ జరుపుతోంది. ఈ కేసులో రియా చక్రబర్తిని ఏ1 ముద్దాయిగా ప్రకటించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.  మరోవైపు ఈ కేసులో ఏ2గా ఇంద్రజిత్ చక్రబర్తి, ఏ3గా సంధ్య చక్రబర్తి, ఏ4గా షోవిక్ చక్రబర్తి, ఏ5గా శామ్యూల్ మిరిండా, ఏ6గా శృతి మోడీతో పాటు పలువురును ఈ కేసులో ముద్దాయిలగా చేర్చింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి రియా చక్రబర్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లావాదేవీలపై కన్నేసింది. రియాతో పాటు బాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుల లావాదేవీలపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో డబ్బులు ఏమైనా చేతులు మారాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Enforcement directorate finds no transaction from sushant singh rajput bank account to rhea chakraborty and other family members,Sushant Singh Rajput suicide case, Rhea Chakraborty, Sushant Singh Rajput, Sushant Singh Rajput news, Sushant Singh Rajput suicide, Sushant Singh Rajput films, Sushant Singh Rajput pics, bollywood, bollywood news, సుశాంత్ న్యూస్, సుశాంత్ మూవీస్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్


తాజాగా ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రియాను దాదపు 18 గంటలకు పైగా విచారించింది. ఈ కేసులో రియాకు తన ఆస్తులకు సంబంధించి అధికారులు అడిగిన అన్ని పత్రాలను వారికి సమర్పించింది. అంతేకాదు తన జీవన విధానం గురించి రియా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి రియా చక్రబర్తికి ఎలాంటి జాయింట్ అకౌంట్ హోల్డర్‌గా లేదని ఈడీ అధికారులు గుర్తించారు. ఇక సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రియాకు కానీ ఆమె కుటుంబ సభ్యుల అకౌంట్‌లకు ఎలాంటి డబ్బులు ట్రాన్స్‌ఫర్ కాలేదని ఈడీ నిర్ధారించినట్టు సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల నిర్ధారణతో రియా చక్రబర్తికి ఈ కేసులో కాస్త ఉపశమనం లభించినట్టే అంటున్నారు నెటిజన్లు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 13, 2020, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading