• Home
 • »
 • News
 • »
 • movies
 • »
 • ENFORCEMENT DIRECTORATE BIG SHOCK TO BOLLYWOOD HERO SHAHRUKH KHAN AND ATTACHED RS 70 CRORES ASSETS TA

షారుఖ్‌ ఖాన్‌కు బిగ్ షాక్.. ఆస్తులు జప్తు..

షారుక్ ఖాన్ ఫైల్ ఫోటో (Source: Twitter)

బాలీవుడ్‌లో ఒకప్పుడు తన సినిమాలతో శాసించి బాలీవుడ్ బాద్షా అనిపించుకున్న షారుఖ్ ఖాన్... ప్రస్తుతం హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఒకప్పుటిలా ఆయన సినిమాలు ఆడటం లేదు. తాజాగా ఆయనకు ఈడీ పెద్ద షాక్ ఇచ్చింది.

 • Share this:
  బాలీవుడ్‌లో ఒకప్పుడు తన సినిమాలతో శాసించి బాలీవుడ్ బాద్షా అనిపించుకున్న షారుఖ్ ఖాన్... ప్రస్తుతం హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఒకప్పుటిలా ఆయన సినిమాలు ఆడటం లేదు. ఇక షారుఖ్ ఖాన్ చివరగా ‘జీరో’ సినిమా చేసాడు. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో షారుఖ్ పేరుకు తగ్గట్టే జీరో అయిపోయాడుగా అంటూ జోక్స్ పేలాయి. ఆ సినిమా దెబ్బతో ఇంత వరకు షారుఖ్.. కొత్త సినిమా ఏది ఒప్పుకోలేదు. షారుఖ్ ఖాన్ నటుడిగానే కాకుండా.. ఐపీఎల్ కోల్‌కతా నైట్ రైడర్ జట్టు యాజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్‌కు సంబందించిన వ్యవహారాల్లో అవకతవకాలు జరిగినట్లు ఈడీ నిర్ధారించారు. ముఖ్యంగా రోజ్ వ్యాలీ పోంజి కుంభకోణం వ్యవహారంలో షారుఖ్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సంబంధముందని ఈడీ నిర్ధారించి రూ. 70 కోట్లను మనీలాండరింగ్ యాక్ట్ కింద సీజ్ చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం పై షారుఖ్ ఖాన్ పీఆర్ వర్గాలు మీడియాలో వివరణ ఇచ్చాయి. ఈ వ్యవహారంలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో పాటు మల్టీపుల్ రిసార్టు ప్రైవేట్ లిమిటెడ్, కోల్‌కతా సెయింట్ జేవియర్స్ కాలేజీ సంబంధించిన ఖాతాలను సీజ్  చేసారు.  enforcement directorate big shock to bollywood hero shahrukh khan and attached rs 70 crores assets,shah rukh khan ed,shah rukh khan enforcement directorate big shock,shah rukh khan assets,shah rukh khan,shahrukh khan,shah rukh khan facts,shah rukh khan songs,shah rukh khan videos,shah rukh khan netflix,shah rukh khan 20 facts,shah rukh and gouri khan,shah rukh khan duofacts,shah rukh khan struggle,shah rukh khan biography,shah rukh khan lifestory,what is shah rukh khan age?,shah rukh khan controversy,shah rukh khan unknown facts,latest shah rukh khan movies,khan,bollywood,షారుఖ్ ఖాన్,షారుఖ్ ఖాన్ ఆస్తుల జప్తు,షారుఖ్ ఖాన్‌కు బిగ్‌ షాక్,షారుఖ్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
  షారుఖ్ ఖాన్ (File/Photo)
  ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ, నటిమణి జుహీ చావ్లా,  ఆమె భర్త విజయ్ మెహతా, వెంకీ మైసూర్ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరి ఖాతాలకు రోజ్ వ్యాలీ గ్రూపు నుంచి నిధుల మళ్లింపు జరగయాని ఈడీ నిర్ధారించింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే‌ట్ అధికారులు.. వీరిని పలుమార్లు ప్రశ్నించారు. అంతేకాదు అనేక మార్లు వీరి ఖాతాలను జప్తు కూడా చేసింది. ఈ వ్యవహారంపై కోల్‌కతా నైట్ రైడర్స్ వర్గాలు స్పందిస్తూ..ఈ లావాదేవిల్లో షారుఖ్‌కు కానీ.. ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఈడీ అటాచ్‌మెంట్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు. వారికి సంబంధించి అదో స్పాన్సర్ డీల్ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు.  2015లో బయటపడ్డ ఈ కుంభకోణంపై ఈడీ పలుమార్లు షారుఖ్‌‌ను ప్రశ్నించింది. అంతేకాదు ఫెమా యాక్ట్‌ను షారుఖ్ సంస్థ ఉల్లంఘించినట్టు తన ఆరోపణల్లో పేర్కొంది.  తాజాగా జరిగిన ఖాతాల జప్తుతో ఇప్పటి వరకు ఈడీ రూ. 4700కు పైగా  కోట్ల వరకు సీజ్ చేసినట్టు సమాచారం. తాజా ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారిని రోజ్ వ్యాలీ గ్రూప్.. షారుఖ్‌కు సంబంధించిన కోల్‌కతా నైట్ రైడర్స‌కు రెండేళ్లు పాటు స్పాన్సర్‌గా వ్యవహరించింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: