ప్రముఖ బాలీవుడ్ రంగస్థల నటుడు శ్రీరామ్ లాగూ కన్నుమూత..

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీరామ్ లాగూ (92) కన్నుమూసారు. ఎన్నో మరాఠీ, హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న శ్రీరామ్ లాగూ మహారాష్ట్రలోని పూనెలోని తన స్వగృహంలో కన్నుమూసారు.

news18-telugu
Updated: December 18, 2019, 8:14 AM IST
ప్రముఖ బాలీవుడ్ రంగస్థల నటుడు శ్రీరామ్ లాగూ కన్నుమూత..
ప్రముఖ మరాఠీ,హిందీ రంగస్థల నటుడు శ్రీరామ్ లాగూ (News18/English)
  • Share this:
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీరామ్ లాగూ (92) కన్నుమూసారు. ఎన్నో మరాఠీ, హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న శ్రీరామ్ లాగూ మహారాష్ట్రలోని పూనెలోని తన స్వగృహంలో కన్నుమూసారు. ముఖ్యంగా మరాఠీ రంగస్థల నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈయన 1927లో నవంబర్ 16న  మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు. ముఖ్యంగా మరాఠీలో అభిమానులు ఆయన్ని ముద్తుగా నట సమ్రాట్‌గా పిలుస్తుంటారు. ఆయన మంచి నటుడే కాదు డాక్టర్ కూడా. దాదాపు 100పైగా హిందీ, మరాఠీ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఉర్రూత లూగించారు. 90లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించాయి.  అంతేకాదు మరాఠీలో 20పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. యువకుడిగా ఉన్నపుడు కొన్ని రోజులు ఈఎన్‌టీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసారు. ఆ తర్వాత ఆయన మనసు సినిమాలపై లాగడంతో తన కెరీర్ మొత్తాన్ని సినిమాలకు, నాటకాలకు అంకితం చేసారు. ఆయన నటనకు ప్రభుత్వం నుంచి పలు అవార్డులు రివార్డులు అందుకున్నారు.

Eminent Theatre and Film Actor Shriram Lagoo Dies, Condolences Pour in,shriram lagoo,shriram lagoo movies,shriram lagoo death,shriram lagoo biography,shriram lagoo natsamrat,shreeram lagoo,shriram lagoo news,dr shriram lagoo,dr. shriram lagoo,shriram lagoo family,shriram lagoo death date,shriram lagoo marathi movie,shriram lagoo passed away,shriram lagoo marathi natak,dr. shreeram lagoo,shreeram lagoo (film actor),shriram lagoo died,shriram lagoo dies,shriram lagoo dead,bollywood,శ్రీరామ్ లాగూ కన్నుమూత,ప్రముఖ రంగస్థలం నటుడు శ్రీరామ్ లాగూ కన్నుమూత,బాలీవుడ్ నటుడు కన్నుమూత
ప్రముఖ రంగస్థల నటుడు శ్రీరామ్ లాగూ కన్నుమూత (News18/English)


 హిందీలో ‘ఆహట్’, ‘పింజర’‘మేరా సాత్ చల్’, హేరా ఫేరా’, ‘సామ్నా’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చూపెట్టారు. ఆయన మృతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే,మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్,సుశీల్ కుమార్ షిండే సంతాపం వ్యక్తం చేసారు. వీరితో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.


First published: December 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు