హోమ్ /వార్తలు /సినిమా /

Gangster Gangaraju: ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' ఎల్లా..ఎల్లా సాంగ్..

Gangster Gangaraju: ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' ఎల్లా..ఎల్లా సాంగ్..

గ్యాంగ్‌స్టర్ గంగరాజు (Gangster Gangaraju)

గ్యాంగ్‌స్టర్ గంగరాజు (Gangster Gangaraju)

Gangster Gangaraju: 'వలయం' సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో లక్ష్ చదలవాడ. అంతకు ముందు కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు దక్కించుకున్న లక్ష్ తన నటనతో విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుని హీరోగా కొనసాగుతున్నాడు.

ఇంకా చదవండి ...

'వలయం' సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో లక్ష్ చదలవాడ. అంతకు ముందు కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు దక్కించుకున్న లక్ష్ తన నటనతో విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుని హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'చదలవాడ బ్రదర్స్' సమర్పణలో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట కూడా విడుదల అయ్యింది. ఎల్లా ఎల్లా అంటూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పాటకి సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం సమకూర్చారు.

పీసి ఖన్నా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ హంగులతో రూపొందుతోన్న 'గ్యాంగ్ స్టర్ గంగ రాజు' చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ .. అలాగే సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇటీవల విడుదలైన `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు`ఫుల్ టైటిల్ వీడియో సాంగ్ కూడా యూట్యూబ్లో ఆకట్టుకుంటుంది.

Akhanda 3 days WW collections: ‘అఖండ’ 3 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య శివతాండవం..ఇటీవల జరిగిన షెడ్యూల్‌తో 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాకి సాయి కార్తీక్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాలో సీనియర్ టాలీవుడ్ నటి జయసుధ కుమారుడు శ్రేయాన్ కపూర్ విలన్‌గా నటిస్తున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు