తాప్సీకు బిల్లుతో షాక్ ఇచ్చిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్..

తాప్సీ పన్ను ఫైల్ ఫోటో (Source: Taapsee Pannu)

Taapsee Pannu: మూడు నెలల లాక్‌డౌన్ తర్వాత నిత్యావసర సరుకులు కొనడానికే కొందరి దగ్గర డబ్బులు లేవు. అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులు చూస్తుంటే నిజంగానే షాక్ కొడుతుంది.

  • Share this:
మూడు నెలల లాక్‌డౌన్ తర్వాత నిత్యావసర సరుకులు కొనడానికే కొందరి దగ్గర డబ్బులు లేవు. అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులు చూస్తుంటే నిజంగానే షాక్ కొడుతుంది. కొందరికి అయితే ఏకంగా లక్షల్లో కూడా బిల్లు ఇచ్చారు అధికారులు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ తర్వాత కరెంట్ బిల్ విషయంలో ఏదో అవకతవకలు జరుగుతున్నాయని.. ఏకంగా 10 నుంచి 20 రెట్లు అదనంగా వస్తున్నాయని చాలా మంది గొడవలు చేస్తూనే ఉన్నారు. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కూడా తమకు వచ్చిన.. ఇచ్చిన కరెంట్ బిల్లులు చూసి షాక్ అవుతున్నారు. ఇప్పుడు తాప్సీ విషయంలో కూడా ఇదే జరిగింది.

ఈమెకు కూడా ఏకంగా 36 వేల కరెంట్ బిల్లు ఇచ్చారు అధికారులు. దాంతో ఈమె షాక్ అయిపోయింది. గతంలో స్నేహ ఇంటికి 40 వేలు.. కార్తిక ఇంటికి లక్షకు పైగా కరెంట్ బిల్ వస్తే వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇప్పుడు తాప్సీ కూడా ఇదే చేసింది. బిల్ చూపిస్తూ.. ఇది మా అపార్ట్‌మెంట్‌ బిల్లు.. వారంలో ఒక్కరోజు మాత్రమే క్లీనింగ్‌ కోసమని ఈ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటాము.. సాధారణంగా ఆ ఇంట్లో ఎవరూ లేరు.. కానీ ఇప్పుడు వచ్చిన ఈ కరెంట్ బిల్లు చూసిన తర్వాత మాకు తెలియకుండానే ఎవరైనా ఆ ఇంట్లో ఉంటున్నారేమో అనే అనుమానం వస్తుంది.. నిజాలను బయటికి తీసుకొచ్చేందుకు మాకు కాస్త సహాయం చేయండి అంటూ అదాని ఎలక్ట్రిసిటీ ముంబై అధికారిక ఖాతాకు ట్యాగ్ చేసింది తాప్సీ.

ఈమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. గత మూడు నెలల బిల్లులను కూడా ఆమె ట్వీట్ చేసింది. ఏప్రిల్‌లో 4,390 రూపాయలు.. మే నెలలో 3,850 రూపాయలు.. జూన్‌లో 36,000 వచ్చినట్లు ఆమె బిల్లులు ట్వీట్ చేసింది. సాధారణంగా వచ్చే బిల్లుతో పోలిస్తే ఏకంగా 10 రెట్లు ఎక్కువగా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి దీనిపై ఎలక్ట్రిసిటీ అధికారులు ఎలా స్పందిస్తారనేది చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: