Home /News /movies /

ELECTED MEMBERS FROM PRAKASH RAJ PANEL RESIGNED FROM MAA AK

MAA Elections 2021: ‘మా’ కమిటీకి ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా.. అసలు వ్యూహం ఇదేనా ?

ప్రకాష్ రాజ్ (Prakash Raj)

ప్రకాష్ రాజ్ (Prakash Raj)

MAA Elections 2021: మాలోని వారంతా ఒకే ప్యానల్‌కు చెందిన వాళ్లు ఉంటే.. వాళ్లు అనుకున్నది చేయొచ్చని ప్రకాశ్ రాజ్ అన్నారు. అందుకే తమ ప్యానల్ నుంచి వివిధ పదవులకు పోటీ చేసిన గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నారని తెలిపారు.

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించగా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ సహా పలువురు విజయం సాధించారు. అయితే మాలోని వారంతా ఒకే ప్యానల్‌కు చెందిన వాళ్లు ఉంటే.. వాళ్లు అనుకున్నది చేయొచ్చని ప్రకాశ్ రాజ్ అన్నారు. అందుకే తమ ప్యానల్ నుంచి వివిధ పదవులకు పోటీ చేసిన గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నారని.. అధ్యక్షుడు మంచు విష్ణు ఆయా పదవుల్లో తనకు నచ్చిన వారిని పెట్టుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవచ్చని సూచించారు. తాము మా అధ్యక్షుడికి సపోర్ట్ చేస్తామన్న ప్రకాశ్ రాజ్.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఆయనను ప్రశ్నిస్తామని వ్యాఖ్యానించారు.

    అయితే ఉన్నట్టుండి ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి మంచు విష్ణు భవిష్యత్తులో కొత్త నియమాలు తీసుకొస్తారని.. అధ్యక్షుడి అనుమతి లేకుండా మా నిర్ణయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని రూల్ పెడతారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ రకమైన నిబంధనలు తీసుకొస్తే.. ఆ తరువాత పదవుల్లో ఉన్నప్పటికీ మా నిర్ణయాలను ప్రశ్నించలేమనే భావనలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఉంది. అందుకే ఈ రకమైన రకంగా బయటకు వచ్చి.. మా కమిటీ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించవచ్చనే వ్యూహంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఉన్నట్టు తెలుస్తోంది.

    దీంతోపాటు రేపటి రోజున మిగతా ప్యానల్స్ నుంచి గెలిచిన వాళ్లు తమను పని చేయనివ్వడం లేదని మంచు విష్ణు, ఆయన ప్యానల్ సభ్యులు ఆరోపణలు చేసే అవకాశం ఉందని.. ఈ రకమైన ఆరోపణలు రాకుండా ఉండేందుకు తమ పదవులను వదులుకోవడం మేలు అనే ఉద్దేశ్యంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానల్ మొదలుపెట్టిన ఈ ట్రెండ్‌తో గెలిచిన మా ప్యానల్ ఇకపై ప్రత్యర్థి వర్గం నుంచి అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.

    Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

    Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

    నిజానికి మంచు విష్ణు తన ప్యానల్ కోసం ప్రచారం చేసిన సమయంలో అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన తాను ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేరుస్తారు ? వీటి గురించి ప్రశ్నించే వారి విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనేది ఆసక్తిరకంగా మారింది. మొత్తానికి మా అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణును ఇరుకుపెట్టేందుకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ అనుసరిస్తున్న రాజీనామాల వ్యూహం ఏ మేరకు పని చేస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: MAA Elections, Prakash Raj

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు