తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్..

మన దేశంలో పాలిటిక్స్ సినిమాలు, ఒక దాని ఒకటి పెనువేసుకుపోయాయి. ఇక మన దగ్గర ఎంతో సినిమా స్టార్స్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్నిపరీక్షించుకున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 22, 2019, 8:39 AM IST
తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్..
సల్మాన్ ఖాన్(ట్విట్టర్ ఫోటో)
  • Share this:
మన దేశంలో పాలిటిక్స్ సినిమాలు, ఒక దాని ఒకటి పెనువేసుకుపోయాయి. ఇక మన దగ్గర ఎంతో సినిమా స్టార్స్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్నిపరీక్షించుకున్నారు. అందుకే ప్రతి రాజకీయ పార్టీ స్టార్ క్యాంపేనర్ల కోసం చూస్తూ ఉంటుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్,టీడీపీ,వైసీపీ,జనసేన సహా పలు పార్టీల్లో సినిమా తారలు సందడి చేస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్‌ను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆ పార్టీ నేతలు పలు వేదికలపై ప్రచారం  కూడా చేసారు. అంతేకాదు ఆ  పార్టీ తరుపున మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి పోటీ చేయనున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసాయి.అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల తరుపున సల్మాన్ ప్రచారంనిర్వహిస్తాడనే టాక్ కూడా వినిపించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆశలపై సల్మాన్ ఖాన్ నీళ్లు చల్లాడు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను ఏ పార్టీ తరుపున ప్రచారం కూడా నిర్వహించడం లేదని కుండ బద్దలు కొట్టాడు.

అంతేకాదు తాను సినిమాలతో ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఓటింగ్ శాతాన్ని పెంచేలా ఓటర్లను ప్రోత్సహించాలని కొన్ని రోజుల క్రితం ప్రధాని మోడీ సెలబ్రిటీలను చేసిన ట్వీట్‌ను గురువారం సల్మాన్ ఖాన్ రీ ట్వీట్ చేసాడు. అంతేకాదు  రాబోయే ఎన్నికల్లో ఓటర్స్ అందరూ భాగస్వాములు కావాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సల్మాన్ ఈ సందర్భంగా కోరాడు.

 

 

First published: March 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు