కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అరుదైన వీడియోను షేర్ చేసిన ఏక్తా కపూర్..

ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యో కి సాస్ బీ కభీ బహు తీ’ వంటి టీవీ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన స్మృతి ఇరానీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ అరుదైన వీడియోను నిర్మాత ఏక్తా కపూర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

news18-telugu
Updated: June 27, 2020, 11:17 AM IST
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అరుదైన వీడియోను షేర్ చేసిన ఏక్తా కపూర్..
కేంద్రమంత్రి పాత వీడియోను షేర్ చేసిన ఏక్తా కపూర్ (Instagram/Photo)
  • Share this:
ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యో కి సాస్ బీ కభీ బహు తీ’ వంటి టీవీ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన స్మృతి ఇరానీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ అరుదైన వీడియోను నిర్మాత ఏక్తా కపూర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. టీవీ సీరియల్స్‌లో అడుగుపెట్టే ముందు ఆమె 1998లో ఆమె మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఏక్తా కపూర్ పోస్ట్ చేసింది. అందులో స్మృతి మాట్లాడుతూ.. తనకు రాజకీయాలంటే ఇష్టమని చెప్పారు. వినయం, విధేయత, మాట నిలబెట్టుకునే తత్త్వమే ఆమెను రాజకీయాల్లో రాణించేలా చేసిందని ఏక్తా కపూర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నా స్నేహితురాలిని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను అంటూ ట్వీట్ చేసింది.
 View this post on Instagram
 

Appreciation Post for my friend Smriti Irani who started off not winning Miss India but went on to become a household name. This is for people who think that success comes easy...it is tough, it is hard but it comes to all those who work hard. Smriti became a household name, today is a minister. Her whole persona has changed into a powerful yet humble politician. But when she started off, she was a meek, shy, simple girl who had walked into Balaji...and we knew her smile would win hearts. Recently, a colleague of hers, who hasn't worked with her, called her up for help, she immediately helped that person. That shows, even today she maintains relations with people who were working with her once. This humility and this attachment to her roots, makes her a fantastic person. So proud of you my friend! @smritiiraniofficial


A post shared by Erk❤️rek (@ektarkapoor) on

స్మృతి ఇరానీ విషయానికొస్తే.. ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యో కి సాస్ బీ కభీ బహు తీ’ సీరియల్‌తో పాపులర్ అయిన స్మృతి.. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీలో వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో ఎన్.శంకర్ డైరెక్ట్ చేసిన జై బోలో తెలంగాణ సినిమాలో కూడా స్మృతి నటించింది. టీవీ, సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత  స్మృతి ఇరానీ.. రాజకీయాల్లో ప్రవేశించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ పై పోటీ చేసి గెలుపొంది జెయింట్ కిల్లర్‌గా పేరు పొందని సంగతి తెలిసిందే కదా.

 
First published: June 27, 2020, 11:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading