కరోనా బాధితుల కోసం కదిలిన బాలీవుడ్ సంగీత ప్రపంచం... వర్చువల్ కాన్సర్ట్‌తో నిధుల సేకరణ

కరోనా బాధితుల కోసం కదిలిన బాలీవుడ్ సంగీత ప్రపంచం

కరోనా పేషెంట్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు... ఏక్ సాథ్ కార్యక్రమం నిర్వహిస్తోంది బాలీవుడ్ సంగీత ప్రపంచం. లైవ్‌ వర్చువల్ కాన్సెర్ట్ ఎలా చూడాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 • Share this:
  కరోనా బాధితులకు సాయం చేసేందుకు ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, ఇంకా ఎంతో మంది కదం తొక్కారు. తాజాగా బాలీవుడ్ సంగీత ప్రపంచం కూడా ఓ అడుగు ముందుకేసింది. బాలీవుడ్ గాయనీ గాయకులు ఇతర ఆర్టిస్టులు అంటే ప్రసూన్ జ్యోతి, మనోజ్ ముంతషిర్, సోనూ నిగమ్, షాన్, అల్కా యాగ్నిక్, కైలాష్ ఖేర్ తోపాటూ... 35 మంది ఇతర బాలీవుడ్ సింగర్స్, కంపోజర్లు... వర్చువల్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు. ఇది జూన్ 5 శనివారం (నేడే) రాత్రి 7 గంటలకు లైవ్ ప్రారంభం కాబోతోంది. దీని ద్వారా విరాళాల రూపంలో వచ్చే డబ్బును ఇండియాలోని కరోనా సోకిన బాధితుల కుటుంబ సభ్యులకు అందిస్తారు. తద్వారా వారిని ఆర్థికంగా ఆదుకుంటారు. అందుకే ఈ కాన్సర్టుకి ఏక్ సాథ్.. ఇండియా విల్ రైజ్ ఎగైన్ (కలిసి సాగుదాం... భారత్ తిరిగి కోలుకుంటుంది) పేరు పెట్టారు.

  ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ కాశ్మీరీ పండిట్ డయాస్పొరా నిర్వహిస్తోంది. అలాగే... అనుపమ్ ఖేర్ ఫౌండేషన్, ఐ యామ్ బుద్ధ ఫౌండేషన్ కూడా నిర్వహిస్తున్నాయి. బాలీవుడ్ నటి పల్లవీ జ్యోషీ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ప్రముఖ గాయనీమణులు లతా మంగేష్కర్, అశాబోస్లే... ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇచ్చారు.

  కరోనా బాధితుల కోసం కదిలిన బాలీవుడ్ సంగీత ప్రపంచం
  కరోనా బాధితుల కోసం కదిలిన బాలీవుడ్ సంగీత ప్రపంచం  ఎలా చూడాలి?
  ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 7 గంటల నుంచి యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో లైవ్ వస్తుంది. 'Ek Sath ,India Will Rise Again' అనే పేరుతో వస్తుంది. దీన్ని లైవ్‌లో చూస్తూ... ఎవరైనా సరే ఆర్థిక సాయం చేయాలనుకుంటే... లైవ్‌లో విరాళాలు దానం చేయవచ్చు.

  ఇది కూడా చదవండి: Weight Loss: లాక్‌డౌన్ టైమ్‌లో బరువు పెరగకుండా చేసుకోవడం ఎలా?

  ఈ కార్యక్రమం ద్వారా వీలైనంత ఎక్కువ నిధులను సేకరించి బాధితుల కుటుంబాలకు అందజేయాలనుకుంటున్నట్లు సింగర్స్ తెలిపారు.
  Published by:Krishna Kumar N
  First published: