హోమ్ /వార్తలు /సినిమా /

Kollywood Star Director Shankar: స్టార్ డైరెక్టర్ శంకర్‌కు షాక్‌.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన కోర్టు

Kollywood Star Director Shankar: స్టార్ డైరెక్టర్ శంకర్‌కు షాక్‌.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన కోర్టు

ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని జోనర్ ఏంటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోనే రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.

Kollywood Star Director Shankar:కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌కు చెన్నై ఎగ్మోర్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు షాక్‌ ఇచ్చింది. శంకర్‌పై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది.

  కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌కు చెన్నై ఎగ్మోర్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు షాక్‌ ఇచ్చింది. శంకర్‌పై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. ఇంతకీ డైరెక్టర్‌ శంకర్‌ అంత పెద్ద తప్పు ఏం చేశాడబ్బా అనే సందేహం రాక మానదు. వివరాల్లోకి వెళితే, 2010లో రజినీకాంత్‌ హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ రోబో అనే సైన్స్‌ ఫిక్షన్‌ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ను సాధించింది. అయితే ఈ సినిమా కథపై అరుల్‌ తమిళ్‌ నందన్‌ అనే రైటర్‌ కోర్టుకి వెళ్లాడు. తాను రాసిన జిగుబా అనే కథను కాపీ కొట్టే శంకర్‌ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడు అని సదరు రైటర్‌ కేసు వేశాడు.

  కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ కోర్టు పలుమార్లు ఆదేశించినప్పటికీ శంకర్‌ నుంచి ఎలాంటి స్సందన రాలేదు. దీంతో శంకర్‌పై నాన్‌ బెయిలబుల్‌ ఆరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేస్తూ కేసును ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. 1996లో అరుర్‌ తమిళ్‌ నందన్‌ రాసిన జిగుబా కథ ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురితమవడమే కాకుండా 2007లో దీన్ని ఓ నవలగా ముద్రించారు. మరిప్పుడు శంకర్‌ తన రోబో కథపై వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకుంటాడనేది చూడాలి.

  రోబో సినిమా 2010లో విడుదలైంది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, ఐశ్వర్యారాయ్‌ జంటగా నటించారు. దీనికి సీక్వెల్‌గా 2018లో 2.0 సినిమా కూడా రజినీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందింది. ప్రస్తుతం శంకర్‌ తాను కమల్‌హాసన్‌తో డైరెక్టర్‌ చేసిన ఇండియన్‌కు సీక్వెల్‌గా, కమల్‌హాసన్‌తోనే ఇండియన్‌ 2ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి నుంచి పునః ప్రారంభం కానుంది.

  Published by:Anil
  First published:

  Tags: Kollywood, Shankar

  ఉత్తమ కథలు