కియారా పాత్రలో ఈషా... ఆ సీన్స్‌లలో ఇరగదీసిన తెలుగమ్మాయి..

ఈషా రెబ్బా Photo : Instagram

'లస్ట్ స్టోరీస్' పేరుతో హిందీలో ఓ వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెబ్ సిరీస్‌ తెలుగులో రీమేక్ చేస్తోంది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

  • Share this:
    తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ హీరోయిన్స్ కనిపించడం చాలా అరుదు. అప్పట్లో ఇక్కడి వాళ్లనే హీరోయిన్లుగా తీసుకున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో తెలుగు హీరోయిన్స్ కనిపించడమే బంగారం అయ్యిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సైతం ముంబై హీరోయిన్స్ పోటీని తట్టుకుని నెట్టుకు వస్తోంది తెలుగందం ఈషా రెబ్బా. ‘అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈషా రెబ్బ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలు దొరకడం లేదు ఈ హాట్ బ్యూటీకి. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ'లో అవకాశం వచ్చినా.. ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అయితే టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ను తన వైపునకు తిప్పుకునేందుకు ఈషా రెబ్బ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ భామ లస్ట్ స్టోరిస్ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. హిందీలో నలుగురు దర్శకులు 'లస్ట్ స్టోరీస్' పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ రూపొందించారు. అందులో కియారా అద్వానీ హాట్ సీన్స్ నటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే . ఇక అప్పటినుండి ఈ భామకు హిందీలో ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి. ఈ విషయాన్ని కియారా కూడా ఓ సందర్బంలో చెప్పుకొచ్చింది.

    కాగా ఇప్పుడు తెలుగులో లవ్ స్టోరీస్ పేరుతో అలాంటి ప్రయోగమే చేస్తోంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఈ సిరీస్‌లో ఒక ఎపిసోడ్‌లో ఇషా రెబ్బా నటిస్తోంది. ఈ ఎపిసోడ్‌ను ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ స్టోరీలోనే ఇషా రెచ్చిపోతుంది అనేది టాక్. హిందీలో కియారా చేసిన పాత్రనే తెలుగులో ఈషా చేసిందట. అంతేకాదు కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో ఈషా అదరగొట్టిందని సమాచారం. మరి ఈ వెబ్ సిరీస్‌తోనైనా ఈ తెలుగు భామకు మంచి గుర్తింపు వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ వెబ్ సిరీస్‌లో లవ్ సీన్స్ జోరు ఎక్కువే ఉంటుందట. అందులో భాగంగా ముద్దులు, హగ్గులు లాంటీ సీన్స్ మోతాదును మించి ఉంటాయని టాక్ వినిపిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ వెబ్ సిరీస్ అతి త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: