ఆ.. వెబ్ సిరీస్‌లో రెచ్చిపోనున్న తెలుగందం...

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ హీరోయిన్లు కనిపించడం చాలా అరుదు. అప్పట్లో ఇక్కడి వాళ్లనే హీరోయిన్లుగా తీసుకున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: November 8, 2019, 12:45 PM IST
ఆ.. వెబ్ సిరీస్‌లో రెచ్చిపోనున్న తెలుగందం...
Instagram/yourseesha
  • Share this:
తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ హీరోయిన్లు కనిపించడం చాలా అరుదు. అప్పట్లో ఇక్కడి వాళ్లనే హీరోయిన్లుగా తీసుకున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో తెలుగు హీరోయిన్లు కనిపించడమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం పోటీని తట్టుకుని నెట్టుకు వస్తోంది తెలుగందం ఈషా రెబ్బా.‘అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈషా రెబ్బ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలు దొరకడం లేదు ఈ హాట్ బ్యూటీకి. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ'లో అవకాశం వచ్చినా.. ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. అయితే టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ను తన వైపునకు తిప్పుకునేందుకు ఈషా రెబ్బ సంచలన నిర్ణయం తీసుకుందట. హిందీలో 'లస్ట్ స్టోరీస్' తరహాలో తెలుగులో 'లవ్ స్టోరీస్' రూపొందుతోంది.
View this post on Instagram

🖤🖤🖤 . . 📸 @chinthuu_klicks 👗 @wisperkadiko . #eesharebba #yourseesha


A post shared by 𝐄𝐄𝐒𝐇𝐀 𝐑𝐄𝐁𝐁𝐀 🌟 (@yourseesha) on

హిందీలో నలుగురు దర్శకులు 'లస్ట్ స్టోరీస్' పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక అడల్ట్ వెబ్ సిరీస్ తీశారు. అందులో కియారా అద్వానీ హాట్ సీన్లో నటించిం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే . ఇప్పుడు తెలుగులో లవ్ స్టోరీస్ పేరుతో అలాంటి ప్రయోగమే చేస్తోంది నెట్ ఫ్లిక్స్.ఈ సిరీస్ లో ఒక ఎపిసోడ్ లో ఇషా రెబ్బ నటించనుంది. ఈ ఎపిసోడ్ ని ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి తీస్తాడు. ఈ స్టోరీలోనే ఇషా రెచ్చిపోతుంది అనేది టాక్. అయితే ఈ సిరీస్ లో ప్రేమలో డోస్ మాత్రం ఎక్కువే ఉంటుందట. ముద్దులు, హగ్గులు.. ఇంకా మరిన్ని కొంత మోతాదు మించుతుంది అనే టాక్ వినిపిస్తోంది.

వదినమ్మ హీరోయిన్ అదిరిపోయే పిక్స్..


Published by: Suresh Rachamalla
First published: November 8, 2019, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading