• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • EESHA REBBA REJECTS SAMANTHA AKKINENI GUNASEKHAR SHAAKUNTALAM FOR THIS REASON HERE ARE THE DETAILS SR

Samantha Akkineni : సమంత అక్కినేని సినిమాను రిజెక్ట్ చేసిన ఈషా రెబ్బా..

Samantha Akkineni : సమంత అక్కినేని సినిమాను రిజెక్ట్ చేసిన ఈషా రెబ్బా..

Eesha rebba Photo : Instagram

Samantha Akkineni : సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వయ నిర్మాణంలో రూపోందిస్తోన్న పౌరాణిక చిత్రం శాకుంతలం.

  • Share this:
    సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వయ నిర్మాణంలో రూపోందిస్తోన్న పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ శాకుంతలంలో వరంగల్ అమ్మడు ఈషా రెబ్బాకు ఓ మంచి పాత్ర వచ్చిందని ఇటీవల వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా అందుతోన్న సమాచారం మేరకు ఈషారెబ్బ శాకుంతలం ప్రాజెక్టుకు నుంచి తప్పుకున్నట్టు మరోవార్త చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలుగందం ఈషా రెబ్బా అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్‏గా పరిచయమైంది. ఆ మూవీ తర్వాత బందిపోటు, అమీ తుమీ, ఆ, రాగల 24 గంటల్లో వంటి సినిమాల్లో నటించినా.. ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. ఆ తర్వాత హీరోయిన్‏గా కాకుండా కీలక పాత్రల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. కాగా పౌరాణిక నేపథ్యంలో సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమాలో ఈషాను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని టాక్ నడిచింది. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తన రోల్‌కు మేకర్స్ ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ పట్ల కొంత అసంతృప్తితో ఉన్న ఈషా.. ఈ మూవీ నుంచి తప్పుకున్నట్టుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    గుణ శేఖర్ శాకుంతలం.. కథ మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకోనున్నారు. ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నాడు గుణశేఖర్. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిచనున్నాడు.








    View this post on Instagram






    A post shared by Eesha Rebba (@yourseesha)













    View this post on Instagram






    A post shared by Eesha Rebba (@yourseesha)








    ఇక ఈషా రెబ్బా ఇటీవలే విడుదలైన నెట్‌ఫ్లిక్స్ తెలుగు ఒరిజనల్ అంథాలజీ పిట్టకథలుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ వెబ్ ఫిల్మ్ పెద్దగా ఆకట్టకోలేకపోయింది. ఈషా రెబ్బా ప్రస్తుతం తెలుగులో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతోపాటు తమిళంలో ఓ సినిమాలో నటించింది. ఈ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు